NTV Telugu Site icon

Harish Rao: కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోంది

Harish 1

Harish 1

తెలంగాణ ప్రజల స్థితిగతులు మార్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ యార్డులో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కేంద్రంపై మండిపడ్డారు. బావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెట్టడం లేదని 12 వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ఇవ్వకుండా కేంద్రం ఆపిందన్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేసి రాష్ట్ర ప్రజలను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు.

గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి గజ్వేల్ రైతులు రెండు పంటలు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఏళ్ల తరబడి ఏనాడు మత్తడి దూకని కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దూకుతుంది అంటే అది కేసీఆర్ వల్లనే అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి హరీష్ రావు. అంతకుముందు హరీష్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గజ్వేల్ లో క్రైస్తవ భవన్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలు పంపిణీ, విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Read Also: China: చైనా కుయుక్తులు.. సరిహద్దు వెంబడి యుద్ధవిమానాల మోహరింపు

కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు క్రీస్తు సోదరసోదరీమణులందరికీ క్రిస్ట్ మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు మంచిని మంచిగా.. చెడును చెడుగా చూడాలని చెప్పారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం పని చేసే మహా గొప్ప నాయకుడు. సీఎం కేసీఆర్ ప్రతీ పండుగను ఘనంగా జరుపుతున్నారు. సమ్మక్క-సారాలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరినా విస్మరించింది. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా జరిపిస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు.

Read Also: FIFA World Cup: సేమ్ టు సేమ్.. సచిన్‌కు జరిగిందే.. మెస్సీకి జరిగింది..!!