NTV Telugu Site icon

Harish Rao: ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దారుణం

Harish Rao

Harish Rao

Harish Rao: కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ‌ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్మడం దారుణమన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన కార్యక్రమంలో 58 జీవో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. రామచంద్రపురం 112 డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధికంగా 738 మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన నియోజకవర్గం పటాన్‌చెరు అని వెల్లడించారు.

Read Also: Robbery : రాజధానిలో బార్ ఓనర్ పై దాడి.. రూ.2కోట్లు దోపిడీ

అమీన్‌పూర్‌ మండలంలో 265, గుమ్మడిదలలో 7, జిన్నారంలో 12, పటాన్‌చెరులో 188, రామచంద్రాపురంలో 266 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీచేసినట్టు వివరించారు. గిరిజనులకు ఇచ్చిన ప్రతీ మాట కేసీఆర్ నిలబెట్టుకున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయన్నారు. 81 వేల ఉద్యోగ నియమాకాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని హరీశ్ రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం, 23 కోట్లు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ వచ్చాక 75 గిరిజన కళాశాలలు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు.

Read Also: Big Breaking: కూకట్ పల్లిలో కూలిన అంతస్తు…. శిథిలాల కింద కార్మికులు

గిరిజనులను ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా చూశారు. దేశంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 2, 471 తాండలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ కోరారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కోసం స్థలం రెడీగా ఉందన్నారు. లాంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. మతతత్వ బీజేపీ పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

Show comments