Site icon NTV Telugu

Harish Rao: మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు ఆపేశారు

Harish Rao Inspects Railway

Harish Rao Inspects Railway

కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. కరోనా కష్టకాలంలో ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు వేశాం అన్నారు. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు పన్ను రద్దు చేశాం. దేశంలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడ చూసిన బోరు బావులకు మీటర్లు పెట్టారు.

రైతు ఇంటి దగ్గరికి బిల్లు పంపారు. బావులకాడ మీటర్లు పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్లు ఆపింది. మీటర్లు పెడతామని సంతకం పెడితే 30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెబుతుంది. అయినా సీఎం కేసీఆప్ ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో తూప్రాన్ లో మూడు మార్కెట్లు వచ్చాయి. గతంలో ఈ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వారు ఒక్క మార్కెట్ కూడా ఇవ్వలేదన్నారు మంత్రి హరీష్ రావు.

Read Also:Ram Gopal Varma: కాపులకు RIP.. కమ్మోళ్లకు కంగ్రాట్స్..!!

మెదక్ జిల్లా పర్యటనలో మంత్రి హరీష్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 22 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారున మంత్రి హరీష్ రావు. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన వ్యవసాయ గ్రీన్ మార్కెట్ యార్డ్ ప్రారంభించారు హరీష్ రావు. ముప్పిరెడ్డి పల్లి కి చెందిన 379 మంది భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు.

Read Also: Shocking Accident : ప్రయాణికుల పాలిట ఉరి తాళ్లుగా మారుతున్న కేబుల్స్

Exit mobile version