NTV Telugu Site icon

Minister Harish Rao: గంట లేట్‌ అయితే ఆయన ప్రాణానికే ప్రమాదం ఉండేది..

Harish Rao

Harish Rao

Minister Harish Rao: దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి హాని చేయడని ఆయన అన్నారు. కొంత మంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి, బాగా తాగించి కత్తితో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. గంట లేట్ అయితే ప్రభాకర్‌ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని.. మొండి కత్తి, కోడి కత్తి అంటూ హేళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కి దుబ్బాక అంటే చాలా ప్రేమ అని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

Also Read: Minister KTR: మీ ఆశీస్సులు కావాలి.. నాకు రాజకీయ భిక్ష పెట్టిందే సిరిసిల్ల

మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. “డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని అంటారు.. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి.. కాంగ్రెస్ వస్తే రాత్రి పూట బావి దగ్గర పండాల్సిన పరిస్థితి వస్తుంది.. 5 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కి ఓటెయ్యండి. 24 గంటల కరెంట్ కావాలంటే కారుకు, కేసీఆర్‌కి ఓటెయ్యండి. కేసీఆర్ సీఎంగా ఉంటే నేను మంత్రిగా ఉంటా.. తెలంగాణలో బీజేపికి మూడు సీట్లు కూడా రావు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిస్తే దుబ్బాకని రెవెన్యూ డివిజన్ చేస్తాం. కొంతమంది దద్దమ్మలు కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు చేతకాని దద్దమ్మలు.” అని మంత్రి పేర్కొన్నారు.

Also Read: KCR Warning: కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్

దుబ్బాకకు డబ్బుల సంచులు వస్తున్నాయట.. డబ్బులు పెట్టి లీడర్లను కొంటున్నారట అంటూ మంత్రి హరీశ్ ఆరోపణలు చేశారు. అటువంటి వాళ్ళను మీ గ్రామాల్లోకి రానివ్వకండని ప్రజలను కోరారు. దుబ్బాకలో 50 వేల మెజారిటీతో గులాబీ జెండా ఎగరాలన్నారు. 26న దుబ్బాకకి సీఎం కేసీఆర్ వస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ గెలిచేది లేదు…తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదని మంత్రి హరీశ్ అన్నారు.