Site icon NTV Telugu

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు

Harish Rao

Harish Rao

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు అయిన నిజాంపేట మండల రెవెన్యూ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక అన్ని పనులు చేయకపోవచ్చు కానీ మెజార్టీ పనులు పూర్తి చేశామన్నారు. ఢిల్లీలో ఉన్నోడు మన పైసలు ఆపుతున్నాడని, అయినా సంక్షేమ పథకాలు అందరికి అందిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. ఇన్ని సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎం చేసిందని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చేతులు ఎత్తేసిందన్నారు.
Also Read : HIT 2: అడివి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2

అయినా కూడా గింజ కూడా మిగలకుండా వడ్లు కొన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు ఉండేవని ఆయన ఎద్దేవా చేశారు మంత్రి హరీష్‌రావు. బీజేపీ ప్రభుత్వం బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమంటుందని, బీజేపీ వాళ్ళు కోట్ల కొలువులు ఇస్తాం అన్నారు.. విదేశాల్లో నల్లధనం తెస్తాం అన్నారని, జన్ ధన్ అకౌంట్ లో 15 లక్షలు ఇస్తాం అన్నారని, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచిందో శ్వేతా పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పక్కనే ఉన్న కర్ణాటక లో మన పథకాలు ఏమి లేవన్నారు. ఇంటి జాగా ఉంటే త్వరలోనే డబ్బులిచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు.

Exit mobile version