Minister Harish Rao : నీతి అయోగ్ రాజకీయ ప్రకటన చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Health Minister Harish Rao Fired on Niti Aayog.
సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. నీతి ఆయోగ్ స్పందిస్తూ.. సీఎ కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నీతి అయోగ్ రాజకీయ ప్రకటన చేసిందని మండిపడ్డారు. అంతేకాకుండా.. బీజేపీకి వంత పాడుతూ నోట్ రిలీజ్ చేసిందని, ఇది నీతి అయోగ్ కి సిగ్గుచేటన్నారు. నీతి అయోగ్ ప్రకటన అర్ధ సత్యాలని ఆయన ఆరోపించారు. సీఎం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదని, 3982 కోట్లు ఇచ్చినా తీసుకోలేదని నీతి అయోగ్ చెప్పిందని, వందల సార్లు మేము లేఖ రాసినా నిధులు విడుదల చేయలేదన్నారు హరీష్ రావు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తారా అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి, స్మిత సబర్వాల్, సీఎస్ లేఖలు రాశారని, ఉలుకు పలుకు లేదని, మళ్లీ అబద్ధాలు ఎందుకు ? అంటూ ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు.
Also Read
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
- Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
కేంద్రం మెడలు వంచి రాష్ట్రాల హక్కులు నీతి అయోగ్ కాపాడాలని, పక్క దారి పట్టించేందుకు నోట్ విడుదల చేయవద్దన్నారు. కేసీఆర్ నీతి అయోగ్ కి చాలా సార్లు వెళ్లారని, వెళ్లి చెప్పినా అరణ్య రోదన అంటూ వివరించారు. అక్కడ పట్టించుకునే దిక్కు లేదని, బాయ్ కట్ అనేది తీవ్ర నిరసన అని ఆయన తెలిపారు. అరగంటలో నే నోట్ ఇచ్చారని, సీఎం బాయ్ కట్ నిర్ణయం తీవ్ర ఒత్తిడి పెంచుతుందని, ఇప్పటికైనా మారతారని భావిస్తున్నామన్నారు. న్యాయమైన వాటా ఇస్తారని ఆశిస్తున్నామని, సెస్ తగ్గించుకుంటారు అని అనుకుంటున్నామన్నారు. లక్ష్యాలు కాగితాలకే పరిమితం కాకూడదని మంత్రి హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Women’s Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
-
Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!