Harish Rao Counter To BJP, Congress: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం చెప్పారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే నిధులు ఇవ్వలేదని చెప్పారు.. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు గతంలో అసత్యాలు మాట్లాడారు.. ముక్కు నేలకు రాస్తానని ఒకరు, రాజీనామా చేస్తానని మరొకరు మాట్లాడారు.. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులవి అబద్దాలు, అదరగొట్టే మాటలే ఉంటాయి.. కాంగ్రెస్ బండారం బట్టబయలు చేసింది నిర్మలాసీతారామన్ అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యనించారు.
Read Also: Bollywood: ఒక్క డిసెంబర్ నెలలోనే మూడు సినిమాలు 2500 కోట్ల బిజినెస్…
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ మోటర్లకు మీటర్లు పెడుతున్నారన్న విషయం నిర్మలా సీతారామన్ చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోయి ఉంటే మోటార్లకు మీటర్లు పెట్టేవారు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లేకుండా చేసే కుట్ర బీజేపీ చేస్తోంది.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కూడా మీటర్లు పెడుతామని డబ్బు తెచ్చుకుంది అని ఆయన ఆరోపించారు. నిన్న- మొన్నా కర్ణాటకలో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా మీటర్లు పెట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసింది.. మీటర్లు కావాలంటే కాంగ్రెస్, బీజేపీలకు.. వద్దనుకుంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: Amelia Kerr Towel: టవల్‌తో బంతిని ఆపింది.. భారీ మూల్యం చెల్లించుకుంది! వీడియో వైరల్
స్వామినాథన్ కమిషన్ రిపోర్టును తుంగలో తొక్కింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తాము గెలవగానే అమలు చేస్తామన్న బీజేపీ ఇప్పటికీ అమలు చేయడం లేదు.. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే అంటూ మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు అని ఆయన ఆరోపించారు. సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా.. ఎవరు వస్తరో రండి.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే.. కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో బావులకి మీటర్లు పెడుతున్నారంటూ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ చేశారు.