Amelia Kerr Towel: టవల్‌తో బంతిని ఆపింది.. భారీ మూల్యం చెల్లించుకుంది! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brisbane Heat penalized for five runs after Amelia Kerr caught the ball using a towel: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ వేసిన త్రోను టవల్ సాయంతో అందుకునే ప్రయత్నం చేసిన బౌలర్‌కు ఫీల్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు. టవల్‌తో బంతిని ఆపినందుకు 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. దాంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 5 పరుగులు వచ్చాయి. ఈ పెనాల్టీ పరుగులతో ఆ జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ ఘటన ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 2023లో చోటు చేసుకుంది.
బీబీఎల్ 2023లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. బ్రిస్బేన్ హీట్ బౌలర్ అమెలియా కేర్ 10వ ఓవర్ వేసింది. ఈ ఓవర్ తొలి బంతిని గార్డ్‌నర్ లాంగాన్ దిశగా షాట్ ఆడగా.. అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని అందుకొని అమెలియాకు విసిరింది. వికెట్ల పక్కనే ఉన్న అమెలియా.. చేతిలో టవల్ సాయంతో బంతిని అందుకునే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్.. 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. అమెలియా తప్పిదంతో బ్రిస్బేన్ హీట్ జట్టుకు షాక్ తగిలింది.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
అమెలియా కేర్ ఉద్దేశపూర్వకంగా టవల్ సాయంతో బంతిని అందుకోకున్నా.. నిబంధనలు అతిక్రమించడంతో అంపైర్ చర్యలు తీసుకున్నాడు. మైదానంలో బంతిని ఆటగాళ్లకు సంబంధించిన వస్తువులతో అడ్డుకున్నా లేదా వాటి వల్ల బంతి ఆగిపోయినా పెనాల్టీ విధిస్తారన్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్ హెల్మెట్ తాకిన సందర్భంలో పెనాల్టీలు వేసిన ఘటనలు ఉన్నా.. టవల్ కారణంగా పెనాల్టీ పడడం ఇదే మొదటిసారి. అయితే బంతిని తుడిచేందుకు అమెలియా టవల్ చేతులోకి తీసుకున్న సమయంలోనే ఫీల్డర్ బాల్ విసరడంతో ఆమె పెట్టుకోక తప్పలేదు.
Also Read: ICC Stop Clock: ఐసీసీ కీలక నిర్ణయం.. ఆలస్యం అయితే 5 పరుగుల పెనాల్టీ!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. అమెలియా కేర్ (64) హాఫ్ సెంచరీ చేసింది. లక్ష్య చేధనలో సిడ్నీ సిక్సర్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసి గెలుపొందింది. పెనాల్టీ రూపంలో వచ్చిన 5 పరుగులు సిడ్నీ జట్టుకు కలిసొచ్చాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు రాకుంటే.. ఫలితం మరోలా ఉండేది. అమెలియా కేర్ తప్పిదం బ్రిస్బేన్ హీట్ టీమ్ ఓటమిని శాసించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?