హై టెక్ సిటీ మెడికవర్ ఆసుపత్రిలో ట్రు బీమ్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. మెరుగైన వైద్యం ప్రజలకు అందించడం కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు ఒక ఛాలెంజ్ అన్నారు. కేన్సర్ అనేది చికిత్స ద్వారా తగ్గించే వ్యాధి. ఎక్కువగా ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలని కోరుతున్నా. చెల్లింపుల గురించి ఎలాంటి ఆందోళన వద్దు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తున్నది. పేదలకు వైద్యం అందించాలి. పేద వారి కోసం మనం ఆలోచన చేయాలని సూచించారు.
Read ALso: TRS Mps On Munugode Bypoll: మునుగోడు ఓటర్లు కేసీఆర్ కు అండగా నిలిచారు
ప్రభుత్వం 11,440 కోట్లు ప్రజల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నదన్నారు మంత్రి హరీష్ రావు. 8 మెడికల్ కాలేజీలు ఒకే రోజున ప్రారంభించు కోబోతున్నము. తెలంగాణలో మెడికల్ కాలేజీల సంఖ్య 17కి చేరుకుంది. ఇది గొప్ప విషయం. క్యాథ్ ల్యాబ్ లు ఏర్పాటు చేసుకున్నాము. అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లో ఏర్పాటు చేశాము. జిల్లాల్లో మోకీలు మార్పిడి సర్జరీలు చేసుకుంటున్నాము. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల విస్తరణ జరుగుతున్నది. మానవత్వంతో, ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నా అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతోందన్నారు మంత్రి హరీష్ రావు.
Read Also: YSR Statue : మంగళగిరిలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు