NTV Telugu Site icon

Minister Harish Rao: ఆ పార్టీ వాళ్ళు తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ

Harish Rao

Harish Rao

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు అమిత్ షా వచ్చి తిడుతారు.. రేపు ఖర్గే వచ్చి తిడుతారు అంటూ మంత్రి అన్నారు. వాళ్ళది తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ అని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది బట్ట కాల్చీ మీద వేసే సంస్కృతి.. ప్రతిపక్షాల పాలనకు మా పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది అని వైద్యారోగ్యమంత్రి అన్నారు.

Read Also: SIIMA Awards -2023: సైమా అవార్డ్స్ లో వేడుకలో మెరిసిన తారలు.. విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే ..!

కాంగ్రెస్ పార్టీది తన్నుల సంస్కృతి.. BRS పార్టీది టన్నుల పంట పండించే సంస్కృతి అంటూ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భారతదేశానికి దిక్సుచిగా మారింది.. దేశంలో 3 శాతం జనాభా ఉన్న మన తెలంగాణ ఎన్నో అవార్డులు సాధించింది.. ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను దాటి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారింది అని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసింది.. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంది.. దేశ వైద్య అవసరాలు తీర్చేందుకు డాక్టర్లును తయారు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Read Also: Madras High Court: వాక్ స్వాతంత్య్రం ద్వేషం కావద్దు.. “సనాతన ధర్మం”పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

అదే విధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించాడు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలిచినప్పటి నుంచి అందుబాటులో లేడు.. ఆ ఎమ్మెల్యే అడ్రస్ లేదు.. ఎక్కడున్నాడో తెలియదు.. నియోజకవర్గ ప్రజలకు ఫోన్ నెంబర్ తెలియని ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కాంగ్రెస్ వాళ్లు గొప్పలు చెప్పి చెవిలో పువ్వులు పెడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ చేసేందేమి లేదు.. కాంగ్రెస్ వి వట్టి మాటలే.. కేసీఆర్ సర్కార్ చేతల ప్రభుత్వం.. కేసీఆర్ పక్క హిందూ.. కానీ కుల మతాలకు అతీతంగా పని చేసాడు.. సీఎం కేసీఆర్ అద్భుతాలు సృష్టిస్తున్నారు.. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు అని హరీశ్ రావు విమర్శించారు.

Show comments