SIIMA Awards -2023: సైమా అవార్డ్స్ లో వేడుకలో మెరిసిన తారలు.. విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIIMA Awards -2023 : సౌత్ ఇండియా సినిమా అవార్డ్స్ వేడుకను దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుక రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది.. నిన్న తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రానా, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రామ్ మిరియాల, మృణాల్ ఠాకూర్, అడవి శేష్, శ్రుతి హాసన్, మంచు లక్ష్మి, బెల్లం కొండ సాయి శ్రీనివాస్, ప్రణీత, శ్రీలీల, శ్రీనిధి, అశ్వినీ దత్, నిఖిల్ సహా పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ట్రెండీ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై మెరిశారు..
తమ ట్రెండింగ్ డ్రెస్సులతో అందరిని ఆకట్టుకున్నారు.. అవార్డులు తీసుకున్న తారల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక త్రిపుల్ ఆర్ సినిమాకు వచ్చిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్‌నే కాదు, రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్టేజిల మీద ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా సైమాలో కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా సైమా అవార్డుల రేసులో 11 నామినేషన్స్‌లలో చోటు దక్కించుకొని 5 కీలకమైన అవార్డులను దక్కించుకుంది. సీతారామం చిత్రానికి గాను మూడు అవార్డులను దక్కించుకుంది..ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా సీతారామం నిలిచింది..
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సైమా విజేతలు ఎవరంటే?
* ఉత్తమ చిత్రం: సీతా రామం
* ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR)
* ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (RRR)
* ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా)
* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడివి శేష్ (మేజర్)
* ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
* ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
* ఉత్తమ సహాయ నటి: సంగీత(మసూద)
* ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
* ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి(RRR)
* ఉత్తమ గేయ రచయిత ‘నాటు నాటు’ పాట కోసం: చంద్రబోస్ (RRR)
* ఉత్తమ గాయకుడు : మిర్యాల రామ్ (DJ టిల్లు) టైటిల్ సాంగ్ కోసం
* ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (ధమాకా) ‘జింతక్’ పాట కోసం
* ఉత్తమ విలన్ : సుహాస్ (హిట్ – 2)
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR)
* ఉత్తమ నూతన దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
* సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)
* ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2)
* ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్)
* ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్.. తదితరులు ఉత్తమ క్యాటగిరిలో అవార్డులను అందుకున్నారు..
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..