Site icon NTV Telugu

Harish Rao: కాంగ్రెస్ ది సుతి లేని సంసారం.. ఎవరికి వాళ్లే నాయకులు

Harish 2

Harish 2

సిద్దిపేట జిల్లా చేర్యాలలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా ఆయన కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ మీటింగ్ లకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. అదే.. బీఆర్ఎస్ మీటింగ్ లకి ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు మార్పు కావాలి అంటున్నారు.. మార్పు అంటే 24 గంటల కరెంట్ కాకుండా మూడు గంటల కరెంటా అని విమర్శించారు. ఈ రోజు డీకే శివకుమార్ మళ్ళీ తెలంగాణకి వచ్చారు.. మూడు గంటల కరెంట్ చాలు అనేవాళ్ళు కాంగ్రెస్ కి ఓటేయండని మంత్రి హరీష్ రావు అన్నారు.

Read Also: Vijaya Sankalpa Sabha: కూకట్‌పల్లిలో విజయ సంకల్ప సభకు అమిత్ షా, పవన్ కళ్యాణ్

రిస్క్ తీసుకోవద్దు.. కారుకు ఓటు గుద్దండి మంత్రి హరీష్ రావు అన్నారు. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపద మొక్కులు మొక్కుతున్నారని విమర్శించారు. వంద అబద్దాలాడైన అధికారంలోకి రావాలని చూస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం కావాలన్న ఢిల్లీకి పోవాలని తెలిపారు. కాంగ్రెస్ ది సుతి లేని సంసారం…ఎవరికి వాళ్లే నాయకులు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస చేతిలో రాష్ట్రం పడితే కుక్కలు చింపిన విస్తరిలా పరిస్థితి అవుతుందని మంత్రి తెలిపారు. ప్రతాప రెడ్డి ఏ సమయంలో ఏ పార్టీలో ఉంటాడో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Barrelakka Special Interview: నన్ను లేపెయ్యాలని చూస్తున్నారు!.. బర్రెలక్కతో స్పెషల్‌ ఇంటర్వ్యూ

Exit mobile version