బీజేపీ పార్టీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాకలో పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ ఫసల్ భీమా యోజన స్కీం ఫెయిల్ అయిందన్నారు. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకో మంత్రి వచ్చి మత ఘర్షణలు లేపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీ నుంచి పది వేల రూపాయలు తేండి.. ఇద్దరం కలిపి రైతులకు ఇరవై వేలు ఇద్దామని ఆయన బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో చేపలకు కల్లాలు కట్టుకోమంటారు తెలంగాణలో మాత్రం కల్లాలకు పైసలు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Virat Kohli: డేంజర్ జోన్‌లో కోహ్లీ.. మళ్లీ రిపీటైతే అంతే సంగతులు!
అబద్ధాల ప్రచారంతో బీజేపీ ముందుకు రావాలని చూస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణకు పైస ఇవ్వని పార్టీ కాంగ్రెస్.. వారు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యస్పదమన్నారు. ఇదే కాకుండా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. చేవెళ్ళ సభకు వచ్చిన అమిత్ షా మత విద్వేషాలు రెచ్చగొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క పనైనా బీజేపీ నేతలు చెప్పాలన్నారు. మీకు చేతనైతే మేమిస్తున్న 10 వేల రూపాయలకు అదనంగా కేంద్రం నుంచి మీరు ఓ 10 వేలు పరిహారం ఇవ్వండని ఆయన అన్నారు.
Also Read : AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలలో ఆలస్యం.. కారణమేంటంటే?