Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజాగా పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పొత్తులు, సీఎం అభ్యర్థి విషయం చేసిన కామెంట్లపై కౌంటర్ ఎటాక్ చేవారు.. పవన్ కళ్యాణ్ పార్టీని నదపలేనని చేతులు ఎత్తేశారన్న ఆయన.. జనసేన కాదు అది జెండా సేన.. ప్రతీ ఎన్నికల్లోనూ ఎదో ఒక పార్టీ జెండా మోయడమే పని అని ఎద్దేవా చేశారు. జనసైనికులు ఇక నుంచి జెండా కూలీలు అని హాట్ కామెంట్లు చేశారు.
చంద్రబాబు దగ్గర ఎంత తీసుకున్నారో పవన్ చెప్పాలి…? అని డిమాండ్ చేశారు అమర్నాథ్.. కాపులను కట్టకట్టి చంద్రబాబుకు తాకట్టు పెట్టాలని పవన్ చూస్తున్నారు అని విమర్శించారు.. ఎవరి దగ్గరో కూలికి చేరతానని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పార్టీ పెట్టానని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నాం.. ఇప్పుడు అదే నిజమైందన్న ఆయన.. మేం చెబితే చెప్పులు చూపించిన పవన్ ఇప్పుడేం చూపిస్తారు..? అని దుయ్యబట్టారు. పొత్తుల గురించి పార్టీలో చర్చించడం కోసమే మండల స్థాయి అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు.
ఇక, పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనేయడం అంత ఈజీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్.. 30 సీట్లిస్తే ముఖ్యమంత్రి ఎలా అవుతారు..? అని ప్రశ్నించిన ఆయన.. పార్టీ నాయకులు, ప్రజలను మోసం చేయడం ఎందుకు..! అని నిలదీశారు. లోకేష్ పాదయాత్రతో వారాహి ఎక్కడికో పోయింది.. ప్రావీణ్యం ఉన్న రంగాల్లో జీవితం వెతుక్కోవాలి.. కానీ, నీకేందుకు రాజకీయం అంటూ హితవుపలికారు. 2024 ఎన్నికలతో వైసీపీకి ప్రతిపక్షం అనేది ఉండదని.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అనేట్టు టీడీపీ, జనసేన క్లోజ్ అంటూ కీలక కామెంట్లు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
