NTV Telugu Site icon

Gottipati Ravikumar: వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు.. వారికి ఉచిత విద్యుత్ పథకం..!

Gottipati Ravikumar

Gottipati Ravikumar

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు. ఐదేళ్లు విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతికాలంలోనే తన అనుభవంతో సరిదిద్దారని అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేక జగన్ అసత్యాలు ప్రచారం ప్రారంభించాడని విమర్శించారు. దీర్ఘకాలంలో పథకాల ప్రయోజనాలను ప్రజలు తెలుసుకుంటారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

Read Also: Donald Trump: అమెరికా అధ్యక్షుడైన తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం..

ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే పీఎంకుసుమ్, సూర్యఘర్ పథకాల వల్ల నష్టమేంటో జగన్ చెప్పాలి..? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర-రాష్ట్ర ప్రాయోజిక పథకాలైన సూర్యఘర్, పీఎం కుసుమ్ వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుందని అన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ మరింత మెరుగ్గా అందించవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఫీడర్ లెవల్‌లోనే నాణ్యమైన విద్యుత్‌ను జగన్ వద్దంటాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యఘర్ ద్వారా నాణ్యమైన విద్యుత్ గృహ వినియోగదారులకు అందుతుందని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Read Also: Liver Disease : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పని అయిపోయినట్లే?

జగన్ నిర్లక్ష్యం చేసిన వీటిని మేం అందిపుచ్చకోవటాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని మంత్రి పేర్కొన్నారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నామన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకోవటంలో చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారని మంత్రి తెలిపారు. ఏ మంచి పథకంపైనైనా విషం చిమ్మి వ్యవస్థను నాశనం చేసేందుకూ జగన్ ముందు ఉంటాడని దుయ్యబట్టారు. ఇద్దరి పాలన మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజలు ఒక్క అవకాశం అని నమ్మినందుకు రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టాడని మంత్రి ఆరోపించారు.