NTV Telugu Site icon

Minister Gottipati Ravi Kumar: వాళ్లు పట్టించుకోలేదు..! ఇప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు

Gottipati Ravikumar

Gottipati Ravikumar

Minister Gottipati Ravi Kumar: గతంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో పాలకులు గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా చోద్యం చూస్తూ కూర్చున్నారు.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల నిధులు కేటాయించి.. గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గడిచిన మూడేళ్ల నుంచి గుండ్లకమ్మలో ఒక్క చుక్క నీరు కూడా నిలబెట్ట లేకపోయారని ఫైర్‌ అయ్యారు.. కానీ, ఇప్పుడు 1.75 టీఎంసీలు నీళ్లు నిలబెట్టగలిగాం అని వెల్లడించారు.. ఇక, గుండ్లకమ్మ ప్రాజెక్టు జంగిల్ క్లియరెన్స్ పై అధికారులతో మాట్లాడుతాం అన్నారు.. మరోవైపు.. లో గ్రేడ్ పోగాకు కూడా వెనక్కి పంపకుండా మొత్తం ఇక్కడే కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

కాగా, ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయిన విషయం విదితమే.. 2022 ఆగస్టులో ఇదే ప్రాజెక్టులో మూడో నంబర్‌ గేటు కొట్టుకుపోయింది. అయితే, మూడో గేటుకు పూర్తి స్థాయి మరమ్మతులు చేయకముందే.. 2023 డిసెంబర్‌లో… రెండో గేటు కూడా కొట్టుకుపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం విదితమే..