NTV Telugu Site icon

Gangula Kamalakar: ఢిల్లీ పాలకుల చేతుల్లో అధికారం పెడితే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారు..

Gangula

Gangula

కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2009లో నన్ను గెలిపించి ఆశీర్వాదం అందించారు.. కరీంనగర్ చరిత్రలో ఎవరికి లేని అదృష్టం నాకే కలిగింది.. మూడోసారి కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు.. బొమ్మకల్ నుండి ప్రచారం చేయడం ఆనవాయితీ.. కాలువ నరసయ్య ఇంట్లో మొదటి ప్రచారం చేశాను అని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు అభివృద్ధి శూన్యం.. కరెంటు నీళ్లు లేక రైతులు ఆగమయ్యారు.. కరెంటు ఎప్పుడు వస్తదని రైతుల ఎదురు చూపులు.. కరువు కాటకాలతో రైతులంతా దుబాయ్ కి వలసలు వెళ్లారు అంటూ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

Read Also: Boora Narsaiah Goud: అందరూ ఊహించిందే జరిగింది.. రాజగోపాల్ రెడ్డి పై బూరనర్సయ్య కామెంట్స్

మానేరు డ్యామ్ పక్కనే ఉన్న తాగటానికి చుక్క నీరు లేదు అని మంత్రి గంగులా కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో కరీంనగర్ దూసుకుపోతుంది.. తెలంగాణలో కరీంనగర్ రూపు రేఖలు మారిపోయాయి.. ప్రతి ఇంట్లో తెలంగాణ ప్రభుత్వంల అమలు చేసిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. బీజేపీ- కాంగ్రెస్ చేతులలో తెలంగాణ పెడితే అభివృద్ధి కుంటుపడుతుంది అని ఆయన విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణ సంపదను ఆంధ్రులు దోచుకెళ్లారు.. అభివృద్ధి చెందిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది అని మంత్రి గంగులా కమలాకర్ చెప్పుకొచ్చారు.

Read Also: BJP MP Laxman: రాజగోపాల్ రెడ్డికి బీజేపీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించింది..

రానున్న ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి అని మంత్రి గంగులా కమలాకర్ కోరారు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది.. కాంగ్రెస్- బీజేపీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది.. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేము అంటూ ఆయన పేర్కొన్నారు.. కరీంనగర్లో ఎక్కడ చూసిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.. 15 సంవత్సరాలలో ఎన్నో నిధులు తీసుకొచ్చాము నగర రూపురేఖలు మార్చాలి.. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి.. ప్రజల మధ్యలో ఉన్న నాయకుడికి పట్టం కట్టాలి.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. తెలంగాణ సంపదను రాష్ట్రాన్ని కాపాడేది కేసీఆర్ ఒక్కడే.. ఢిల్లీ పాలకుల చేతుల్లో అధికారం పెడితే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారు అంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో గొప్ప నగరంగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతా.. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరీక్షించే నాయకునికి పట్టం కట్టాలి అని మంత్రి గంగులా కమలాకర్ కోరారు.