NTV Telugu Site icon

Gangula Kamalakar: కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే కాళేశ్వరాన్ని బద్దలుకొట్టి నీళ్లు ఎత్తుకుపోతారు..

Gangula Kamalakar

Gangula Kamalakar

Gangula Kamalakar: రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, రెవెన్యూ, టీ-సెర్, మహిళ, ట్రాన్స్ జెండర్ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌గా మారకముందు ఆంధ్రావాళ్లు మద్రాస్‌లో ఉండేవారని.. మద్రాస్ వాళ్లు పారిపొమ్మని చెప్పడంతో హైదరాబాద్‌కు వచ్చి సంపన్న హైదరాబాదును స్వాధీనం చేసుకున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. సంపద వస్తున్న హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారని ఆయన గుర్తు చేశారు.

దాంతో ఆంధ్ర రాజకీయ నాయకులు అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొడుతూ ఆంధ్రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. మహారాష్ట్రలో పుట్టిన గోదావరిని, తెలంగాణలో పారుకుంటూ పోయే గోదావరి నీటిని రాష్ట్రంలో ఆగకుండా ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టి ఆపుకొని వ్యవసాయం సాగించారన్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రిలతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి తెలంగాణను నీళ్లు నిధులు నియామకాలు లేకుండా చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో కొనసాగుతోందని మంత్రి తెలిపారు.

Read Also: Ponguleti: సమాధానం చెప్పే రోజు వస్తుంది.. పువ్వాడ పై బగ్గుమన్న పొంగులేటి..

రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ను గెలిపిస్తే రెండు పార్టీలు కేంద్రం చెప్పు చేతల్లో పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే మొట్టమొదటిగా చేసేది కాళేశ్వరం ప్రాజెక్టును బద్దలు కొట్టి నీళ్లు ఎత్తుకుపోతారంటూ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల కోసం పనిచేయడం లేదన్న మంత్రి.. రాబోయే భావితరాల కోసం కష్టపడుతున్నామంటూ ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే మళ్లీ సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలన్నారు.

Show comments