వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హన్మకొండ వరంగల్ జిల్లాల అధికారులు ఎమ్మెల్యేలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని, 154 ప్రాంతాలు నీటమునిగాయన్నారు. రెండు జిల్లాల్లో 418 కోట్ల నష్టం వాటిల్లిందని, గ్రేటర్ వరంగల్ పరిధిలో 177 కోట్లు నష్టం జరిగిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. విద్యుత్ కు కోటిన్నర నష్టం వాటిల్లిందని, 480 పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. 43 కిమీటర్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, భద్రకాళి చెరువు కట్ట గండి పడగా వెంటనే పూడ్చివేశామన్నారు మంత్రి ఎర్రబెల్లి. భద్రకాళి బండ్ కు 150 కోట్లతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని, వడ్డేపల్లి చెరువు కట్ట మరమ్మతులు చేయనున్నామన్నారు.
Also Read : CM KCR : నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ
వర్షం వరదలు తగ్గడంతో క్లీనింగ్ పనులు ముమ్మరం చేశామని, అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. కల్లెడ చెరువు కట్ట తెగిపోకుండా పర్వతగిరి ఎస్ఐ తీసుకున్న చర్యలు అభినందనీయమని, వర్షం వరదలతో చనిపోయిన వారికి 4 లక్షల ఎక్సిగ్రేషియా ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. గాయపడ్డవారికి ప్రభుత్వ పరంగా వైద్యం అందించడంతోపాటు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, సామాగ్రి కొట్టుకుపోయి వారికి 18 వేలు ఆర్థిక సహాయం అందించనున్నామన్నారు.
Also Read : Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
అంతేకాకుండా.. ‘కోర్టు స్టే లతో కబ్జాలపై చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. గత ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వడంతో ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాజకీయం చేయవద్దని బిజేపి కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాం. మా బీఆర్ఎస్ కార్యకర్తలు రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు. సహాయక చర్యలకు అందరు సహకరించాలని కోరుతున్నాం. సీఎం కేసిఆర్ ఎప్పటికప్పుడు అందరిని అప్రమత్తం చేస్తున్నారు’ అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
