NTV Telugu Site icon

Minister Errabelli : దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Minister Errabelli : దేవుళ్ల పేరుతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాజకీయం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పర్యటించారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, నూతనధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాలకుర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని మంత్రి దయాకర్ రావు హామీ ఇచ్చారు. కవులు, కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తిగా సీఎం కేసీఆర్ ను ఆయన కొనియాడారు. 63 కోట్లరూపాయలతో బొమ్మెర, పాలకుర్తి, వాల్మీడిని టూరిజం హబ్ గా తీర్చి దిద్దుతున్నట్లు ప్రకటించారు.

Read Also: Revanthreddy : అప్పుడు గవర్నర్ స్పందిస్తే.. ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతతత్వ పార్టీ అని.. దేవుళ్ళ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న పార్టీగా అభివర్ణించారు. రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రాబోవు మహశివరాత్రికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాలకుర్తి విచ్చేస్తారని మంత్రి దయాకర్ రావు వెల్లడించారు. కాజీపేట్ (మం) బాలవికాస పీపుల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్… బాలవికాస ఫౌండర్ ఆధ్వర్యంలో 20 మాసాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

Read Also: Petrol Rate: అక్కడ బంకుల్లో కంటే బ్లాక్ లోనే రేటు తక్కువట

దేశాన్ని పాలించే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లోని అభివృద్ధి, సంక్షేమంపై, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై చర్చకు సిద్ధమా? మిషన్‌ భగీరథ మీద చర్చకు వస్తారా? గ్రామాల అభివృద్ధిపై వస్తారా? అని మంత్రి సవాల్‌ విసిరారు. దేశమంతా సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటుంటున్నారని, కంటి వెలుగును తమ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తామని ఖమ్మం సభలోనే పలువురు సీఎంలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

Show comments