NTV Telugu Site icon

Dharmana Prasada Rao: ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తుంది..

Darmana Prasad Rao

Darmana Prasad Rao

గడచిన 75 సంవత్సరాల పాలన కంటే సీఎం జగన్‌ పాలన భిన్నమైనది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చాలనేదే జగన్ తాపత్రయం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది రాజకీయ అవకాశం కల్పించాలని ఉద్యమాలు చేశారని మంత్రి చెప్పారు. అన్ని వర్గాలకు అధికారం కట్టబెట్టిన వ్యక్తి కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే ఇలా చేయగలరు.. గత ప్రభుత్వంలో మైనార్టీలు, గిరిజనులకు కనీస అవకాళం కల్పించ లేదు అంటూ ఆయన మండిపడ్డారు. పేదల కన్నీళ్లు తుడిచి ఆకలి తీరుస్తుంటే చంద్రబాబు చూసి బాధపడుతున్నాడు.. ప్రభుత్వ డబ్బంతా ఖర్చైపోతోందని గగ్గోలు పెడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం మామూలు విషయం కాదు.. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏప్పుడైనా జరిగిందా ఇలా అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

Read Also: Bandi Sanjay: మరికొద్ది గంటల్లో పోలింగ్.. బండి సంజయ్ సంచలన ప్రకటన..!

Show comments