NTV Telugu Site icon

Dharmana Prasada Rao: వాలంటీర్లను టీడీపీ ఐదేళ్ల పాటు ఎంతో అవమానించింది..

Darmana

Darmana

AP Election 2024: వాలంటీర్లు అనే వారు లేరు.. ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వాలంటీర్లు అంతా రిజైన్ చేసారు.. గతంలో కూడా పార్టీ ఆశయాలు నమ్మే కుటుంబం నుంచి వచ్చినవారే .. టీడీపీ ఎన్ని అవమానాలు చేసిన ఐదేళ్లు నిలబడి పని చేశారు.. అప్పుడు ఓ మాట.. ఇప్పుడో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలయ్యాక.. రిజైన్ చేసిన వారందరిని తిరిగి వాలంటీర్లుగానే నియమిస్తాం.. ఎవరు టెన్షన్ పడొద్దని ఆయన తెలిపారు. వైసీపీ కార్యకర్తలుగానే పని చేయండి.. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ రేట్లను పెంచం అంటున్నారు.. అంటే ఉన్న రేట్లే ఉంటాయిగా ఇక మీకు మాకు తేడా ఏంటి అన్నారు. ఆరు నెలల క్రితం వైసీపీ ఓడిపోద్దన్నారు.. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగినా 110 సీట్లు వస్తాయనే స్థాయికి వచ్చామన్నారు.. ఇంకా 30 రోజుల సమయం ఉంది.. మరిన్ని సీట్లు పెరుగుతాయని మంత్రి ధర్మన ప్రసాద్ రావు వెల్లడించారు.

Read Also: Flipkart Bus Tickets: ఊరు వెళ్తున్నారా.. బస్‌ టికెట్లు ఇక్కడ బుక్‌ చేసుకోండి.. భారీ డిస్కౌంట్‌ పొందండి..!

రాజధాని పేరుతో విన్యాసాలు చేసి డబ్బులు దోచుకునే ప్రయత్నం చంద్రబాబు చేశారు అని ధర్మన ప్రసాద్ రావు తెలిపారు. ఇప్పుడు సిగ్గు లేకుండా చంద్రబాబు అధికారం కావాలని అడుగుతున్నాడు.. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.. హాస్పిటల్స్ , స్కూల్స్, సచివాలయాలను నిర్మించామన్నారు. ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఏలా అని ప్రశ్నించారు. బ్రోకర్ ముండా కోడుకులు ఐదేళ్లు అధికారంలేక నలిగిపోతున్నారు అని విమర్శలు గుప్పించారు. చెరువులు, బట్టిలను చూపి డబ్బులు దోబ్బారు.. దొంగల బ్యాచ్ అంతా మళ్లీ ఒకటైపోతున్నారు.. ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి.. బాబోస్తే జాబ్ అన్నారు.. కానీ బాబోచ్చాక జనాలకు గూబ పగిలిపోయింది.. మహిళలకు, రైతులుకు అన్ని విధాలా ఆదుకున్నాం.. ఇక, నా మీద పోటీ చేసే అబ్యర్ది ఎవరో జనాలకే తెలీదు అని మంత్రి ధర్మన ప్రసాద్ రావు తెలిపారు.