Site icon NTV Telugu

Minister Dharmana Prasada Rao: వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే.. మీ పీక మీరు కోసుకోవడమే..

Minister Dharmana

Minister Dharmana

Minister Dharmana Prasada Rao: శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు‌.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మహిళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వైసీపీని వ్యతిరేకించడం అంటే గొప్ప అనుకోకండి.. వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే మీ పీక మీరు కోసుకోవడమే, మీచేతిని మీరు నరుక్కొవడమే అన్నారు.. సీఎం వైఎస్‌ జగన్ ఓడిపోతే ఆడవాళ్లకి ఎంత చేశాడు, అడోళ్లు ఆడోళ్లు అనుకొని చచ్చాడురా అంటారు. తరువాత వచ్చిన ప్రభుత్వం ఆడవాళ్లని పట్టించుకోదన్నారు. సమాజంలో మహిళలకు ఇంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వాన్ని వద్దనుకుంటే ఏం చేయాలి.? అని ప్రశ్నించారు. నూనె ,‌గ్యాస్ , కరెంట్ పెరగాయంటూ మాట్లాడుతున్నారు.. దేశం మొత్తం పెరిగాయి , మనవద్దే కాదని తెలిపారు.. ధరలు పెరిగినా తట్టుకునేలా మీ ఎకౌంట్స్ లో డబ్బు జమచేస్తున్నాం. ఇతర రాష్ర్టాలలో , గత ప్రభుత్వాలలో ఇలా‌జరగలేదు కదా? అని ప్రశ్‌నించారు.. మహిళలు ‌ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి ధర్మాన.

మరోవైపు.. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన.. చంద్రబాబు నాయుడు ఏదో ఒక పేరు పెట్టి… వాళ్లకి రూ.371 కోట్లు డబ్బు ఇచ్చాడు. చంద్రబాబు చెప్పిన సంస్థకు కాకుండా బోగస్ సంస్థకు ఆ డబ్బు వెళ్ళిందనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ దాన్ని పట్టుకుందన్నారు. బోగస్ సంస్థ నుండి సెల్ కంపెనీలకు.. అక్కడ నుండి ఆ డబ్బు చంద్రబాబు పీఏ, లోకేష్ పీఏ అకౌంట్లకి వచ్చాయని పట్టుకున్నారని.. వాళ్లని పట్టుకుందామనీ వెళ్తే ఒకడు దుబాయికి, ఇంకొకడు అమెరికాకి పారిపోయారని వెల్లడించారు.. వాళ్లని పట్టుకుంటే ఈ డబ్బు ఎక్కడికెళ్లిందో తేలిపోతుందన్నారు.

ఇక, ప్రజా జీవితంలో ఉన్నవాడు డబ్బులు ఇలా తినేస్తే ఊరుకోరు అని హెచ్చరించారు ధర్మాన.. మేమందరం కోర్టుమందు విచారణకు నిలబడిన వాళ్ళమే గతంలో.. ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని ఒక సంస్థ చెబితే నమ్మేస్తారు.. నువ్వు జనం ముందు దబాయించటం కాదు.. కోర్టులో రుజువు చేసుకోవాలని సలహా ఇచ్చారు. అప్పటి ప్రభుత్వంలో డబ్బంతా ఇతరుల అకౌంట్లకు వెళ్లి తిరిగి వాళ్ల అకౌంట్లకి వచ్చేది అని ఆరోపించారు. మా ప్రభుత్వంలో డబ్బంతా ప్రజల అకౌంట్లలోకి వెళ్తుందంటూ అభివర్ణించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మరోవైపు.. మళ్లీ జగన్‌ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు.. కానీ, మన గుర్తు ఏదంటే మాత్రం కొందరు సైకిల్‌ అని అంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ గుర్తుపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు మంత్రి ధర్మాన.

Exit mobile version