Dharmana Prasada Rao: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకవ్యాఖ్యలు చేశారు. దేశంలో 75 సంవత్సరాలలో రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు తమ పార్టీకి ఓటు వేసిన వారికే సంక్షేమం ఇచ్చారని.. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్ని బెదిరించి కొంతమందికి మాత్రమే సంక్షేమం అందించారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో మతం, కులం, పార్టీ వాడా కాదా అని చూడలేదు.. పేదవాడా కాదా అన్నది చూసి అందిరికీ సంక్షేమం అందించామన్నారు. వైసీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి తేడా ఇదే.. మనం ఓటు కోసం చెప్పడం లేదన్నారు. ఇంటికి వెళ్లి చెప్పాల్సింది ఇదే.. ఎక్కడా లంచం లేకుండా ఇబ్బంది లేకుండా పథకాలు ఇచ్చాం కదా అని చెప్పారు. దేశంలో మొదటిసారి ఇటువంటి ప్రయోగం చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ అంటూ మంత్రి తెలిపారు.
Read Also: AP Lokayukta: 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం
గతంలో నీకెంత, నాకెంత… దండం పెట్టుకోవాలి… లేదంటే కార్డు తీసేస్తాడు.. పించన్ ఆపేస్తారని భయపడ్డారన్నారు. నేడు భయంలేకుండా జీవిస్తున్నారని, పథకం అందించడంలో, గౌరవంగా అందుకోవడమే అభివృద్ది అంటూ పేర్కొన్నారు. ఇటువంటి పథకాలు టీడీపీ వాళ్లు కొందరు మీసం తిప్పుతూ నాకు ఆపమనరా అని ఛాలెంజ్ చేస్తున్నారని.. అటువంటివి పట్టించుకోవద్దు… మనం పేదవాడు అని చూస్తున్నామన్నారు. మీ ఇంటి ముందుకే వెల్‌నెస్ సెంటర్, పాఠశాల, వైద్యశాల వచ్చింది.. అంటే అభివృద్ది వచ్చింది కదా అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎక్కడ అభివృద్ది అంటున్నారు… ఆయనకు అభివృద్ది అంటే ఏమిటో కనపడలేదా… పేదవాడికి ఏమి అందిస్తున్నామో తెలియదా…రోడ్డు ఒక్కటే అభివృద్ది కాదన్నారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు, 15 లక్షల ఇళ్లు ఇచ్చి గ్రామాలే సృష్టించామన్నారు. చంద్రబాబు నువ్వు ఏమి చేస్తావు.. చెప్పు అంటూ ఆయన ప్రశ్నించారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. “రాజమండ్రిలో మనం ఇచ్చినదానికన్నా ఎక్కువ ఇస్తానని అంటావు… రైతులకు, మహిళలకు నాకు అధికారం ఇవ్వండి మీ అప్పు తీరుస్తానని అన్నావు… అధికారం ఇస్తే ఏమి చేశావు…ఎన్నికలు రాగానే పసుపు, కుంకుమ అని నాలుగు వేలు ఇచ్చి సల్లగా జారుకున్నావు.. చంద్రబాబునాయుడు నిన్ను ఎన్నుకుంటే ఇచ్చిన పథకాలు రద్దు చేస్తావా… ?.. బాబు నిన్ను నమ్మలేము… అన్ని అబ్దదాలే.. మీకు కావాల్సిన కార్యక్రమాలు అన్ని ఇళ్ల వద్దనే సచివాలయ అధికారులు చేస్తున్నారు.. ఇంతకంటే మీకు ఏమి కావాలి…. పేదలకు చెందిన భూమి 75 సంలుగా కొంతమంది చేతుల్లో భూమి ఉంది… భూ యాజమాన్యం హక్కు కల్పించిన ఘనత జగన్ దే.. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన బీదవాడు ఎవడైనా భయం లేకుండా వైద్యం చేసుకుంటున్నాడు.. గ్రామంలో, మండలంలో, జిల్లాలో వైద్యశాలలు, వైద్య సిబ్బందిని నియమించిన ఘనత మాదే.. 14 సంవత్సరాలుగా పాతపట్నంలో చంద్రబాబు హాయంలో ఏనాడు వైద్యులు, వైద్య సిబ్బంది ఎప్పుడూ ఉండే వారు కాదు.. నేడు ఈ నియోజకవర్గ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఫుల్‌గా ఉన్నారు.. ప్రైవేటు స్కూలుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్మించాం.. టీచర్లు సిబ్బంది, ఫర్నిచర్ ఇచ్చాం.. ఓటు కోసం కాదు ఇది చేసింది… సమాజంలో అంతరాలు పోవాలంటే చదువు ద్వారానే పోతుందనే నమ్మకంతో ఇన్ని ఏర్పాట్లు చేశాం… చంద్రబాబు పాతపట్నం నియోజకవర్గంలో ఆయన చేసిన పని ఏదో చెప్పమనండి.. తెలుగుదేశం కార్యకర్తలు ఏమి చెప్పడానికి ఏమి లేదు…. విద్యుత్తు ఛార్జీలు పెంచామని చెబుతున్నారు.. నమ్మకండి… మనకన్నా తక్కువ ఛార్జీల ఇస్తున్న 29 రాష్ట్రంలలో ఒక్కటి చూపమనండి..నిత్యావసర సరకుల రేట్లు పెరగడం, తరగడం అంతా కేంద్రం చేతిలో ఉంటుంది.. మనపై ఏమి చెప్పాలో తెలియక జగన్ దుర్మార్గం అంటారు.” అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.