NTV Telugu Site icon

Dadisetti Raja: అభివృద్ధి కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలి..

Dadisetti Raja

Dadisetti Raja

Dadisetti Raja: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. నేతలు నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి దాడిశెట్టి రాజా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తుని మండలం హంసవరంలో మంత్రి దాడిశెట్టి రాజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని, జగన్ సీఎం కావాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ఇచ్చే అమలు కానీ హామీలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రతిపక్ష పార్టీలు ఓట్ల కోసం అమలు చేయలేని హామీలతో వస్తున్నారని, ప్రజలు కాస్తా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: CM YS Jagan: చంద్రబాబు నీ స్కీమ్‌లు ఏమిటి?.. ఒక్కటైనా గుర్తుందా?