NTV Telugu Site icon

Dadisetti Raja: గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలి..

Dadisetti Raja

Dadisetti Raja

Dadisetti Raja: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు మంత్రి దాడిశెట్టి రాజా. మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. తుని మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి దాడిశెట్టి రాజా. వార్డుల వారీగా వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలని ఆయన కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తునిలో తనకు, రాష్ట్రంలో జగన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.. మున్సిపల్ ఎన్నికల్లో తునిలో ఏవిధంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందో అవే ఫలితాలు వచ్చేలా ఆశీర్వదించాలని కోరారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు..

పేదలకు మంచి జరగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని మంత్రి దాడిశెట్టి రాజా సూచించారు. జగనన్న హయాంలోనే గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. సంక్షేమ పాలనతో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న రుణాన్ని 13 తేదీన జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనుకుంటున్న వారిని ప్రజలు ఓడించాలని మంత్రి దాడిశెట్టి రాజా కోరారు.