NTV Telugu Site icon

Chelluboyina Venugopalakrishna: జగన్ అంటే నిజం.. నిజాన్ని జనం నమ్ముతారు..

Venugopalakrishna

Venugopalakrishna

Chelluboyina Venugopalakrishna: జగన్ అంటే నిజం.. ఆ నిజాన్ని జనం నమ్ముతారు అంటూ ఏపీ సీఎం, వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఏపీ మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని రాయుడుపాకల గ్రామంలో విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ అంటే నిజం… నిజాన్ని జనం నమ్ముతారు అని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయననే సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైఎస్‌ జగన్ చేశారన్న ఆయన.. వైఎస్‌ జగన్‌ చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామరక్షగా అభివర్ణించారు. వైఎస్‌ జగన్‌ గెలుపును కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నాం.. ప్రతి అభ్యర్థిలోనూ ప్రజలు జగన్నే చూస్తారని పేర్కొన్నారు.

Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ లవ్ స్టోరీస్ మామూలుగా లేవుగా..

ఇక, పవన్‌ కల్యాణ్‌కు సహనం తక్కువ అంటూ జనసేనానిపై సెటైర్లు వేశారు మంత్రి వేణుగోపాలకృష్ణ.. ప్రచారం ప్రారంభించిన రెండో రోజే పవన్‌ వెళ్లిపోయారన్న ఆయన.. పవన్ కల్యాణ్‌ను పిఠాపురం నియోజకవర్గానికే పరిమితం చేయటం ద్వారా చంద్రబాబు రాజకీయ ప్రదర్శించాడని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వారు చరిత్రలో లేరంటూ హాట్‌ కమెంట్లు చేశారు ఏపీ మంత్రి రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తమ తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో ముమ్మరంగా సాగిస్తుండగా.. మరోవైపు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తోన్న విషయం విదితమే.