Chelluboina Venugopalkrishna: కులగణనపై సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అందరూ అభినందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బీహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉందని ఆయన అన్నారు. బాలకార్మిక వ్యవస్థను జగన్ నిర్మూలించారని మంత్రి తెలిపారు.
Also Read: Kodali Nani: టీడీపీకి కొడాలి నాని సవాల్.. అది నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై..!
కులాలకు ఆత్మగౌరవ రక్షకుడు సీఎం జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు. అన్ని కులసంఘాల పెద్దలను భాగస్వామ్యం చేయాలనేదే మా ఆలోచన అంటూ ఆయన తెలిపారు. వాలంటీర్లను వినియోగించినా కులగణనను సెక్రటేరియట్ సిబ్బంది మాత్రమే పర్యవేక్షిస్తారన్నారు. సూచనలు స్వీకరించేందుకు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇస్తున్నామన్నారు. జగన్ మరో రామ్‌మనోహర్ లోహియా అంటూ ఆయన కొనియాడారు. మా ప్రయత్నం సఫలమౌతుందని ఆశిస్తున్నామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు.