NTV Telugu Site icon

Venugopal Krishna: బెయిల్ రద్దు అయితే చంద్రబాబు జైలుకే.. చేసిన తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు..!

Venugopal Krishna

Venugopal Krishna

Venugopal Krishna: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ పొందరు.. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రద్దు అయితే చంద్రబాబు మళ్లీ జైలుకే వెళ్తారని వ్యాఖ్యానించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కుల వ్యవస్థను రెచ్చగొట్టారు. ఏ కులం చేత ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలను అణచి వేయడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు దెబ్బతింటాయన్నారు. మేలు చేసిన నాయకుడు వెంటే వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. మళ్లీ వైఎస్‌ జగనే ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పే దమ్మున్న నేత వైఎస్‌ జగన్‌ అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

Read Also: Ayodhya Ram Mandir: జనవరి 22న గర్భగుడిలో ఎవరెవరు ఉంటారు.? ప్రాణప్రతిష్ట ఎలా చేస్తారు..?