Chellaboina venugopal: చంద్రబాబు కులాల మధ్య గొడవలు సృష్టించి.. అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కుల సమాజాన్ని.. బీసీలను న్యూనతా భావంతో చంద్రబాబు మాట్లాడారు అని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు.. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు.. తాను అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి.. ఇప్పుడు సూక్తులు చెబుతున్నాడు.. తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి.. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు ఆని ఆయన ఆరోపించారు. మాటలు చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా అంటూ ప్రశ్నించారు. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా అంటూ అడిగారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..? అని వేణుగోపాల కృష్ణ క్వశ్చన్ చేశారు.
Read Also: Dhanush: హీరో ధనుష్ తండ్రినని కోర్టుకెక్కిన వ్యక్తి మృతి!
Also Read
చంద్రబాబు బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు… ఇదో పెద్ద అబద్ధం అని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు.. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పింఛన్లు పెంచితే దానిపై అక్కసు చూపిస్తావా అంటూ మండిపడ్డారు. మీ పార్టీ ఏనాడైన బీసీలకు రాజ్యసభ స్థానాలు కేటాయించావా అన్నారు. ఇవాళ సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు.. సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు శెట్టి బలిజలకు కేటాయించలేకపోయాడు.. రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకుంటున్నావ్.. కులాల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం నీ ఆలోచన అని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ సగానికి సగం తగ్గించి బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలనుకున్నావు.. చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి మంత్రి వేణుగోపాలకృష్ణ ఆరోపించారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?