Site icon NTV Telugu

Minister Buggana Rajendranath Reddy: నీకు నచ్చిన ఆట ఏదైనా చెప్పు నేను రెడీ.. గెలువు చూద్దాం..!

Buggana

Buggana

Minister Buggana Rajendranath Reddy: తనపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన కామెంట్లకు కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.. ఆర్థిక మంత్రి ఎక్కడ అంటున్నావు, మంత్రి ఎక్కడ ఉంటాడో నీకు తెలియదా ..? అని ప్రశ్నించిన ఆయన.. 30 ఏళ్ల రాజకీయ అనుభవం తరువాతే అధికారంలోకి వచ్చా .. డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించా .. నీ రాజకీయ ప్రస్థానంలో నీవు చేసిన అభివృద్ధి చూపిస్తావా ..? అని ప్రశ్నించారు. లేదా.. నాతో వస్తే తీసుకెళ్లి నేను చేసిన అభివృద్ధి చూపిస్తా.. సింగిల్ గా వచ్చినా అభివృద్ధి చూపిస్తాను అని సవాల్‌ చేశారు. రైల్వే సహాయక మంత్రిగా కర్నూలుకు కోచ్ ఫ్యాక్టరీ తెచ్చానని చెప్పావు.. అది ఏమైందో చెప్పు.. ఆ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు అని దుయ్యబట్టారు.

Read Also: Kumari Aunty: కుమారి ఆంటీనా మజాకానా.. తగ్గేదేలే.. భారీ బంగారం హారాన్నీ కోనేస్తుందిగా…!

కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజకీయ జీవితాన్ని అంతం చేసి టీడీపీ చేరావు అంటూ ఫైర్‌ అయ్యారు బుగ్గన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కోట్లకు ఎంత మేలు చేశాడో ప్రజలందరికీ తెలుసన్న ఆయన.. గతంలో డోన్ లో చేసిన అభివృద్ధి రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అన్నారు. కేంద్రమంత్రిగా ఉండి, కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉండి డోన్ ప్రజలకు ఏమి చేశారో చెప్పండి అని సవాల్‌ చేశారు. ఇక, ఫ్లైఓవర్ బ్రిడ్జి పొడవు ఎందుకు పెంచారో అందరికి తెలుసు.. ప్రజలకు ఏమి చేస్తావో అది చెప్పండి అని నిలదీశారు. సింగిల్ గా డోన్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లే దారి నీకు తెలియదు.. మీరు నా బుగ్గ పగులుతాది అంటున్నావు.. నీకు ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రజలు మీకు బుగ్గ పగలగొట్టారు అని సెటైర్లు వేశారు. నేను చేసిన అభివృద్ధి చూపించేందుకు నేను సిద్ధం.. నువ్వు సిద్దమా? అని చాలెంజ్‌ చేసిన ఆయన.. నన్ను ఓడించేందుకు లక్ష్యం పెట్టుకున్నావు.. ఎందుకు? అని ప్రశ్నించారు.. ఇదే సమయంలో.. ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతావు.. నీకు నచ్చిన ఆట అడుదాం.. గెలువు చూద్దాం.. లేదా నీకు నచ్చిన ఆట ఏదైనా చెప్పు నేను రెడీ అంటూ సవాల్‌ చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

Exit mobile version