Botsa Satyanarayana: నిజం గెలుస్తుంది అన్నది పెద్ద జోక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: నిజం గెలుస్తుంది అన్నది పెద్ద జోక్ అంటూ నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాం.. బడుగు, బలహీన వర్గాలకు చేసిన మేలు చెప్పడానికే సామాజిక సాధికార యాత్ర చేపట్టాం అన్నారు.. ఎన్టీఆర్ బ్రతికి ఉన్న సమయంలో టీడీపీలో బీసీలకు ప్రాధాన్యత ఉంటే ఉండవచ్చు.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి టీడీపీలో లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యధిక శాతం బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అత్యధిక శాతం బీసీలకే ఇచ్చారని గుర్తుచేశారు.
Read Also: ENG vs SL: ఈ 5 కారణాల వల్లే ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.. అవేంటంటే?
Also Read
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
ఇక, పార్టీలో రెడ్లు ఆధిపత్యం ఏం చేయటం లేదన్నారు మంత్రి బొత్స.. అలా ప్రతిపక్షాలు మాట్లాడుతుంటాయని దుయ్యబట్టారు.. నేను ఎవరికీ సబార్డినేట్ కాదు, నా నెత్తిన ఎవరినీ పెట్టలేదన్న ఆయన.. చంద్రబాబు జైల్లో ఉంటే.. కొడుకు , భార్య తిరుగుతున్నారు.. మిగతా వారు ఎందుకు బయటకు రావడం లేదు..? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేయలేదా..? దోచుకు తినలేదా? సీమెన్స్ కంపెనీ ఒడంబడిక ఏమైంది..? నిజం గెలుస్తుంది అన్నది పెద్ద జోక్.. ఆధారాలు చూపించకపోతే చంద్రబాబు ఎందుకు నలబై రోజులు జైల్లో ఉంటాడు అని మండిపడ్డారు. వ్యవస్థలు మేనేజ్ చేసి, జిమ్మిక్కులు చేసే వ్యక్తి ఎందుకు జైల్లో ఉన్నాడు.. చంద్రబాబు తప్పు చేశాడు.. దోచుకు తిన్నాడు.. స్కాం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇక, గెలుపు ఓటములు ప్రక్కన పెడితే.. సామాజిక సాధికారత మా నినాదం.. సామాన్యుల ఆర్దిక పరిస్థితి మెరుగు పర్చడం, జీవన పరిస్థితి మెరుగు పర్చడం మా విధానంగా స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.
తాజావార్తలు
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!