NTV Telugu Site icon

Botsa Satyanarayana: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం.. మరీ చంద్రబాబు..?

Botsa

Botsa

రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు అడిగినా, అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి అని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మా పార్టీ వ్యతిరేకం, పార్లమెంటులో పోరాటం కూడా చేశాం.. కూటమిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు, నాయకత్వం స్టీల్ ప్లాంట్ మీద తమ వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సెంటిమెంటుతో కూడిన సున్నితమైన అంశాన్ని రాజకీయాలు చేయ్యొద్దు అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ ఎవరినైనా అభ్యర్థిగా పెట్టుకోవచ్చు.. కానీ లాబీయిస్ట్ లను తెచ్చి పెట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అని బొత్స సత్యనారాయణ అన్నారు.

Read Also: Bournvita: “బోర్న్‌విటా”ని హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలి.. కేంద్రం కీలక ఆదేశాలు..

అనకాపల్లిలో పోటీ చేయడానికి క్యాష్ పార్టీ తప్ప బీసీ నాయకత్వమే కనిపించే లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశమే ప్రదానం.. అదే కీలకం కావాలని డిమాండ్ చేస్తున్నాం.. వాలంటీర్లపై చంద్రబాబు మాటలు చూస్తుంటే నాలుకా.. తాటి మట్టా అన్నట్టుగా వుంది.. చంద్రబాబుకు నిర్దిష్టమైన విధానం, నిలకడైన మాటలేదు.. వయసు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో చంద్రబాబు అయోమయంలో ఉన్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణలో కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలను సమర్థవంతంగా కట్టడి చేశాం.. టెక్నాలజీ ఆధారంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.