Bournvita: “బోర్న్‌విటా”ని హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలి.. కేంద్రం కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bournvita: బోర్న్‌విటాని హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు అన్ని ఈ-కామర్స్ సంస్థలకు తమ ప్లాట్‌ఫారమ్స్ నుంచి తొలగించాలని సూచించింది. వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బోర్న్‌విటాతో పాటు అన్ని రకాల పానీయాలను ఈ కేటగిరి నుంచి తొలగించాలని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (CPCR) యాక్ట్, 2005 సెక్షన్ (3) కింద ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ, CPCR చట్టం, 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపిన తర్వాత ‘‘ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు మోండెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు మరియు నిబంధనలు ప్రకారం హెల్త్ డ్రింక్స్ నిర్విచించబడలేదు’’ అని మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Read Also: Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు సర్వీస్‌లు నిలిపివేత!
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
హెల్త్ డ్రింక్ లేదా ఎనర్జీ డ్రింక్స్ కేటగిరి కింద ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో విక్రయించబడుతున్న డైరీ బెస్డ్ బెవరేజ్ మిక్స్, సెరియల్ బేస్డ్ బెవరేజ్ మిక్స్, మాల్ట్ బేస్డ్ బెవరేజ్‌లు సమీప కేటగిరితో ‘ప్రొప్రైటరీ ఫుడ్’ కింద లైసెన్స్ పొందిన ఆహార ఉత్పత్తులని గుర్తించిన తర్వాత FSSAI నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. దీంతో FSSAI అన్ని ఇ-కామర్స్ కంపెనీలకు వారి వెబ్‌సైట్‌లలోని ‘హెల్త్ డ్రింక్స్/ఎనర్జీ డ్రింక్స్’ కేటగిరి నుంచి అటువంటి పానీయాలను తీసేయాలని లేదా తొలగించడం ద్వారా ఈ తప్పుడు వర్గీకరణను వెంటనే సరిదిద్దాలని సూచించింది.
మరోవైపు, బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యమైన పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉందని ఎన్‌సిపిసిఆర్ చేసిన పరిశోధన నేపథ్యంలో ఈ ఆర్డర్స్ వచ్చాయి. భద్రతా ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన మరియు పవర్ సప్లిమెంట్లను ‘హెల్త్ డ్రింక్స్’గా అంచనా వేస్తున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని NCPCR భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI)ని కోరింది.
తాజావార్తలు
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!