Site icon NTV Telugu

Minister Botsa Satyanarayana: అధికారం కాదు.. విలువలు ముఖ్యం

Botsa

Botsa

Minister Botsa Satyanarayana: అధికారం కాదు.. విలువలు ముఖ్యం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పందించిన ఆయన.. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం అని హితవు పలికారు.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పొత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైసీపీ గెలుస్తుందని పేర్కొన్నారు.. 4 సిద్ధం సభలు విజయవంతం మా పార్టీ బలంగా తెలిపిన బొత్స.. వారం రోజులుగా ఈ రాష్ట్రంలో పొత్తుల కోసం టీడీపీ, సెలబ్రిటీ పార్టీ తహతహలాడాయి అని ఎద్దేవా చేశారు.. ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం.. కానీ, 14ఏళ్ల పాలించిన చంద్రబాబు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అనడం జుగుప్స కలిగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, NTRకు వెన్నుపోట్లు పొడిచారని.. అమరావతి రైతుల ఆకాంక్షలను దెబ్బ తీశారని మూడు నెలల క్రితం బీజెపీ నేతలు మాట్లాడారు.. పొత్తులు పెట్టుకున్నప్పుడు రాష్ర్ట ప్రయోజనాల సంగతి ఏదీ..? అని నిలదీశారు.

Read Also: Oppenheimer OTT: ఏడు అవార్డులతో సత్తా చాటిన సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే.. గెట్ రెడీ

ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై బీజెపీ, చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు బొత్స.. చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని మేదర మెట్ల సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడితే వక్రీకరిస్తున్నారన్న ఆయన.. ముఖ్యమంత్రి ధైర్యానికి నిన్న బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు నిదర్శనం అన్నారు. నిన్నటి సభకు వచ్చిన జనం గ్రాఫిక్స్ అనే విమర్శలు పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళలా వున్నాయని మండిపడ్డారు.. చంద్రబాబును అదే భ్రమలో వుండమనండి.. ప్రజలే నిర్ణయం ఇస్తారని వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై బీజెపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకట్ రెడ్డి ఎవరు వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన టైం వేస్ట్ అన్నారు. ప్రజలతోనే మా పొత్తు.. పార్టీలతో కాదని స్పష్టం చేశారు. మూడు పార్టీలు కాదు కదా 30 పార్టీలు వచ్చినా మమ్మల్ని ఎదుర్కోలేవను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సిద్ధం సభలు తర్వాత రాష్ట్రంలోని 175 సీట్లు మావేననే నమ్మకం కుదిరిందన్నారు. ఈ రాష్ట్రంలో బీజెపీ, టీడీపీ ఉన్నాయా..? అంటూ ఎద్దేవా చేశారు.. ఎన్నికల ప్రచారంపై వెయిట్ అండ్ సీ.. ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Exit mobile version