NTV Telugu Site icon

Botsa: చంద్రబాబు ఎప్పటికీ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు

Bosta

Bosta

Botsa Satyanarayana: పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో సామాజిక సాధికార యాత్ర సన్నాహా సమీక్ష సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదని విమర్శించారు. చంద్రబాబు అనే వ్యక్తి అధికారం దుర్వినియోగం అధికారులను వాడుకొని అవినీతి చేసినట్లు రుజువు అయింది కాబట్టి నేటికీ కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

Post office Scheme : సూపర్ స్కీమ్.. రూ.లక్షలతో రూ. 20 లక్షలు పొందవచ్చు..

గతంలో వ్యవస్థలను మెనజ్ చేస్తూ చంద్రబాబు కాలం గడిపారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని పదవులలో బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి తెలిపారు. నాలుగున్నర ఎనిమిది నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని పేర్కొన్నారు. జరిగిన సంక్షేమ, అభివృద్ధి పై ప్రజలకు మరింత వివరంగా చెప్పాల్సిన బాధ్యత నాయకుల పై ఉందని మంత్రి తెలిపారు. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Raja Singh: పద్నాలుగు నెలలు బీజేపీకి దూరంగా ఉన్నా..