AP DSC New Schedule 2024: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నిర్వహణకు షెడ్యూల్‌లు విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు డీఎస్సీ-2024 షెడ్యూల్‌లో మార్పులు చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.. మార్చి 25వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులోకి రానుండగా.. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.. ఇక, 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో ఈ పరీక్షలు నిర్వహించేవిధంగా షెడ్యూల్ రూపొందించారు.
Read Also: TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
కాగా, రాష్ట్రంలో 6,100 ఉపాధ్యాయుల నియామకం కోసం డీఎస్సీ-2024 షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే.. డీఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం.. పాత షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే, ఎస్జీటీ అర్హతలను మార్చడం, టెట్ కు డీఎస్సీకి మధ్యన తగిన సమయం ఇవ్వడం వల్ల షెడ్యూల్ లో మార్పులు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.. ఇక, పరీక్ష సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.