NTV Telugu Site icon

Botsa Satyanarayana: జగన్‌ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు..

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడ్డామన్న సీఎం హామీలను ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం ముఖ్యమంత్రిపై మహిళలలో పెరగడం వల్ల నిన్న ఎద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్నారు. ఇది నూతన ఒరవడి అంటూ పేర్కొన్నారు. టీడీపీ మోసాలు , కుయుక్తులు చేసిందని ఆయన విమర్శించారు. ల్యాండ్ యాక్ట్‌పై టీడీపీ చేసిన ప్రచారాలను రైతులు నమ్మలేదన్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ధి ముఖ్యమని, దానిని చూసే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. జగన్‌ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో కూటమి దిగజారిపోయిందని.. ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. కూటమి దౌర్జన్యాలకు పాల్పడితే మేం సంయమనం పాటించామన్నారు. ప్రతిపక్షం చేష్టలు, చేతలు,మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా వున్న సంయమనం పాటించమనేది మా పార్టీ అధ్యక్షుడి ఆదేశమన్నారు. వైసీపీ కార్యకర్తలు సహకరించడంతో మంచి పోలింగ్ జరిగిందన్నారు. 175కి 175 గెలుస్తామని.. ప్రజల నాడి తెలుసు కనుకే మా నాయకుడు ఆ నినాదం తీసుకున్నారన్నారు.

Read Also: CM YS Jagan: జగన్‌ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

హింసాత్మక ఘటనలు ఎవరి మీద జరుగుతున్నాయో చూడాలన్నారు. ఓటమి భయంతో వైసీపీ మీద టీడీపీ దాడులకు తెగబడుతోందన్నారు. జరుగుతున్న దాడులలు చూస్తుంటే ఎవరు ఓటమి భయంతో వున్నారో అర్థం అవుతుందన్నారు. సీఎం విదేశాలకు వెళ్ళాలనేది ఎన్నికల ముందే నిర్ణయం జరిగిందన్నారు. విద్యావ్యవస్థకు సంబంధించిన మీటింగ్ ఒకటి వుంటుందన్నారు. ఎన్నికల ముందు షెడ్యూల్ చెబితే ఎన్నికలకు ముడిపెడతారని ప్రకటించలేదన్నారు. ఏపీలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పింది నిజమేనన్నారు. గతంలో వచ్చిన 23 కూడా ఇప్పుడు రావన్నారు.

మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్న ఆతృతతో మహిళలు ఓట్లు వేశారని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పేర్కొన్నారు. గతం కంటే ఈసారి వైజాగ్ పార్లమెంటులో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. వైసీపీ విధానాలు నచ్చడంతో ప్రజలు పట్టం కడతారనే నమ్మకం వుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రానుందని బొత్స ఝాన్సీ ధీమా వ్యక్తం చేశారు.