NTV Telugu Site icon

Botsa Satyanarayana: బాధ్యతగా మాట్లాడాలి.. రండి బహిరంగ చర్చకు..

Botsa Satyanaranayan

Botsa Satyanaranayan

Botsa Satyanarayana: మా మేనిఫెస్టోలో ఇచ్చిందే మేం అమలు చేస్తున్నాం.. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఇక్కడకు వచ్చి మైకులు పట్టుకుని డబ్బాలు కొడుతున్నారు అని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏవీ అమలు కాలేదని ఆ నాయకులు చెబుతున్నారు.. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రమ్మనండి.. అంటూ సవాల్‌ చేశారు.. ఆ పెద్ద నాయకులను మేనిఫెస్టో పట్టుకొని డిబెట్‌కు రమ్మనండి అంటూ చాలెంజ్‌ చేశారు మంత్రి బొత్స.. ఇక, 2014-19లో మీరు ఏం చేశారో.. ఇప్పుడు మేం ఏం చేశామో ప్రజలు చూస్తారని హితవుపలికారు.. బాధ్యతగా మాట్లాడాలి.. ఆదర్శంగా ఉండాలని సలహా ఇచ్చారు.. వ్యక్తిగతంగా మేం మాట్లాడం.. వ్యవస్థాపరంగానే మాట్లాడుతామని.. బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read Also: Man Eats Wifes Brain: భార్య మెదడును తిన్న మెక్సికన్‌ వ్యక్తి.. పుర్రెను యాష్‌ట్రేగా..

మరోవైపు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, అమిత్ షాతో సమావేశమైన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం జోరందుకుంది.. దీనిపై స్పందించిన మంత్రి బొత్స.. ముందస్తు ఎన్నికలు, పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే ఉండదని.. మార్చిలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఓటమి భయం ఉన్న వారికే పొత్తులు అవసరమని ఆయన దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని.. ప్రస్తుతం ఉన్న వాటికంటే అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ జోస్యం విషయం విదితమే.