ఏపీలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నది మా ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు వేరు కాదు. ఇప్పటి వరకు ఉన్నత మేర.., అందుబాటులో ఉన్స అవకాశాల మేరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాం. పీఆర్సీ అందులో ఒక్కటి. పీఆర్సీ లో మరికొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి., వాటినీ త్వరలో పరిష్కరిస్తాం. విద్యా పరంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఎంఈఓ ప్రమోషన్స్ పూర్తి చేసాం అన్నారు మంత్రి బొత్స.
Read Also: Asaduddin Owaisi: నితీష్ కుమార్ “గోద్రా అల్లర్ల” సమయంలో బీజేపీలోనే ఉన్నారు.
సీపీఎస్, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తాం అన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు, నిబంధనలు సూచనలు పరిగణలోకి తీసుకుని ఏ ఏడాది ఆఖరికి పరిష్కరిస్తాం. సీపీఎస్ అంశానికొస్తే.., మా ప్రభుత్వ ఎన్నికల 100 హామీల్లో ఇదొక్కటి. ఈ హామీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఉద్యోగ సంఘాలతో పలు దఫాలు చర్చలు జరిపాం. జీపీఎస్ ద్వారా చేకూరే ప్రయోజనాలనూ ఉద్యోగులకు తెలియచేసాం. సీపీఎస్ విషయంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అందరి ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. ఆ నిర్ణయం కూడా రెండు నెలల లోపు వెల్లడిస్తాం అన్నారు బొత్స సత్యనారాయణ.
Read Also: Kunamneni Sambasiva Rao: ఇది విమోచనో, విలీనమో గవర్నర్ కి ఎందుకు?