NTV Telugu Site icon

Minister Atchannaidu: ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తా..

Atchannaidu

Atchannaidu

గత ప్రభుత్వంపై మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గత ఐదేళ్ళ పాలనలో చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టించారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని.. రూ.13 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని తెలిపారు. ఏ మంత్రి, ఏ శాఖను రివ్యూ చేసినా.. ఎక్కడా అప్పులు తప్ప ఆదాయం కనిపించడం లేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఒకొక్క హామీని నెరవేరుస్తామని చెప్పారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పెంచిన పింఛన్లు అందించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ఐదేళ్లలో పేద వారికి అన్నం పెట్టడానికి కుడా ఇష్టం లేకుండా అన్న క్యాంటీన్లు తీసివేశారని వ్యాఖ్యానించారు. గతంలో కట్టిన భవనాల్లో సాంఘీక కార్యక్రమాలు చేపట్టారని.. రాష్ట్రంలో మరో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభానికి అంచనా వేశామని పేర్కొన్నారు.

Read Also: Saripodhaa Sanivaaram: యూఎస్‌లో నాని క్రేజ్‌ అదిరిందోచ్‌.. తన రికార్డు తానే బ్రేక్‌ చేస్తాడా?

తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శ్రేయోభిలాషులు, ఎన్ఆర్ఐ సోదరులు ఇచ్చిన డబ్బులతో అన్న క్యాంటీన్ నడిపామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. ఛాలెంజింగ్ గా ఉన్న కార్యక్రమాలు చిత్తశుద్దితో నిర్వహిస్తానని.. ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తానని మంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే.. అధికారులు బదిలీలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. అటెండర్ నుండి ఉన్నతాధికారి వరకు బదిలీలు కోసం ఒక్క పైసా ఇచ్చినా తీసుకునే చర్యలు తీసుకుంటామని అన్నారు. బదిలీల కోసం పైరవీలను ప్రోత్సహించవద్దని తెలిపారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గౌరవాన్ని పెంచే విధంగా తాను పని చేస్తానని చెప్పారు. మరోవైపు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.