Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!

Anitha

Anitha

అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతిపై ప్రమాదవశాత్తు డ్రోన్ బ్యాటరీ పడింది. దాంతో మంత్రికి స్వల్ప గాయమైంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు స్పందించి సంబంధిత డ్రోన్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హోంమంత్రి అనితకు ఎస్పీ సుబ్బరాయుడు ప్రాథమికంగా బ్యాండేజ్ వేశారు. చేతికి స్వల్ప గాయం అయినప్పటికీ.. అనిత కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా కొనసాగించారు. చేతికి చిన్న బ్యాండేజ్‌తోనే వేదికపై ప్రసంగించారు. మంత్రి అనితకు పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం డ్రోన్ వినియోగం, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ అనుకోని ఘటన కొద్దిసేపు అక్కడ కలకలం రేపింది.