NTV Telugu Site icon

Anagani Satya Prasad: చంద్రబాబు విజన్, పవన్ కల్యాణ్‌ ఆలోచన, మోడీ అండతో.. రాష్ట్ర అభివృద్ధి

Anagani Satya Prasad

Anagani Satya Prasad

Anagani Satya Prasad: సీఎం చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆలోచన, ప్రధాని నరేంద్ర మోడీ అండతో రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం అన్నారు ఏపీ రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. బాపట్ల జిల్లా రేపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014-2019 మధ్యకాలంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే మిన్నగా 2024 నుంచి ఏర్పడిన కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేస్తాం అన్నారు.. ప్రధాని మోడీ అండతో రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేస్తాం.. ఇప్పుడున్న కలయికతో పోలవరం, అమరావతిలో త్వరగా పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు..

Read Also: Fastest Century: 27 బంతుల్లోనే సెంచరీ.. క్రిస్ గేల్ ‘ఆల్‌టైమ్’ రికార్డు బ్రేక్‌!

ఇక, నిన్ననే సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు మంత్రి అనగాని.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ అండతో తీర ప్రాంతమైన రేపల్లెను కూడా అభివృద్ధి చేస్తా అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాకతో రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఆయన.. జగన్‌కు విలాసవంతమైన భవనాల పిచ్చి ఉంది .. భీమిలి ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాలను కొల్లగొట్టి ఋషికొండను అభివృద్ధి చేశామని చెబుతున్నారు.. ఋషికొండపై ఆ పార్టీ నాయకులకే సరైన అభిప్రాయం లేదన్నారు.. ఋషికొండను ధ్వంసం చేసి ప్రజాధనాన్ని వృథా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వ భవనం కట్టాలంటే నియమ నిబంధనలు ఉంటాయని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.

Read Also: Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌కు బెదిరింపు కాల్స్‌.. రాజీనామా చేయాలని వార్నింగ్..!

కృష్ణాజిల్లాలోని అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములను మాజీమంత్రి జోగి రమేష్ వారి కొడుకు బంధువులు భూ హక్కు పత్రాలు మార్చారని అవయోగం వచ్చింది.. వాటిపై కూడా పూర్తిగా విచారణ చేపడతాం అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. తప్పులు చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఆయన.. మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వెళ్లదని స్పష్టం చేశారు.. ఇక, అమరావతే ఏకైక రాజధాని.. ఇప్పటికే అమరావతిలో ఎలక్ట్రికల్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.