Site icon NTV Telugu

Ambati Rambabu: పదవిని పక్కనపెట్టి కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాసపాత్రుడు అనిల్..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: జగన్ ఆదేశించాడు అన్న ఒక్క మాట కోసం మంత్రి పదవిని పక్కనపెట్టి కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాసపాత్రుడు అనిల్ కుమార్‌ యాదవ్‌ అని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఒక బీసీ అభ్యర్థిని నిలబెడదాం అన్న ఆలోచనతో నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్ళమంటే పార్టీని మారిపోయిన విశ్వాసఘాతకుడు ఎంపీ కృష్ణదేవరాయలు అని ఆయన విమర్శించారు. గతంలో ఏ పార్టీ కూడా పల్నాడులో బీసీ అభ్యర్థికి ఎంపీ సీట్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

లక్ష ఓట్ల పైన మెజారిటీతో గెలిపించి జగనన్నకు నరసరావుపేట ఎంపీ సీటు కానుకగా ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. బీసీలకు సీటు ఇస్తానంటే, పార్టీ మారిన కృష్ణదేవరాయలకు బీసీ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. పల్నాడులో ఏడు రథాలను నడిపించగల శ్రీకృష్ణుడు అనిల్ కుమార్ యాదవ్ అని.. అనిల్ అనే రథం కింద ఎవ్వరైనా నలిగి పోవాల్సిందే…. ఎన్నికల తర్వాత ఆ విషయం అందరికీ అర్థమవుతుందన్నారు.

Exit mobile version