Ambati Rambabu: ఏ విషయంలోనూ స్పష్టత లేని వ్యక్తి పవన్ కల్యాణ్.. ఆయన అమాయకుడనో.. మెంటల్ అనో అనను.. కానీ, చంచల మనస్కుడు.. రాజకీయాలకు పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల్లో హీరో అయిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే హీరో అవుతారు అని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్.. కానీ, కామెడీ యాక్టర్ అవుతారని నిరూపించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని సెటైర్లు వేశారు.. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చావు.. ఐదేళ్ళ టీడీపీ పాలనలో ఎవరిని ప్రశ్నించావు..? అని నిలదీశారు. సీఎం జగన్ ఎన్ని మంచి పనులు చేసిన కొనియాడ లేడు, ప్రశ్నిస్తాడు అని మండిపడ్డారు. అసలు, రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ధ్యేయం ఏమిటి..? సింగిల్ గా పోటీ చేస్తావా, అసెంబ్లీలో అడుగు పెట్టడమా.. నీకు క్లారిటీ ఉందా ? గతంలో రెండుసార్లు అధికారం ఇచ్చుంటే బాగా చేసేవాడట.. లేదంటే దిగిపోయేవాడట.. ఈ మాత్రం దానికి అధికారం కోరుకోవడం దేనికి.. ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావా లేదా సూటిగా చెప్పాలి.. 175 స్థానాలకు పోటీ చేస్తావా లేదా కనీసం సగం స్థానాలుకైనా పోటీ చేస్తావా.. ఇదేనా స్పష్టం చేయాలి.. అసెంబ్లీలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తావా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి అంబటి.
పవన్ ప్రధానమైన ధ్యేయం ఆయన ఒక్కడే అసెంబ్లీకి వెళ్లడమేనన్న అంబటి.. రెండు ట్రిప్పులకు ఇప్పుడే ప్రచారం చేసుకోవటం విచిత్రం అని సెటైర్లు వేశారు. నువ్వు ఎక్కడ నిలబడతావో తెలియదు.. ఎన్ని సీట్లుకు పోటీ చేస్తావో తెలియదు.. దేనీపైనా క్లారిటీ లేదు.. చంచల మనస్తత్వం, ఏ విధమైన క్లారిటీ లేని పవన్ వెనుక మీరు ఎందుకు ఉన్నారని జనసైనికులు, వీర మహిళలను ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.. ఇదంతా నడిపేది చంద్రబాబు అనే విషయం స్పష్టం.. పాపం పవన్ మానసిక ఘర్షణకు లోనవుతున్నాడని తెలిపారు. చిరంజీవి పార్టీ పెట్టాడు…18 సీట్లు సాధించాడు రాజకీయాల్లో నిలబడలేని అనుకున్నాడు.. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు.. కానీ, రాజకీయాలు నడిపించుకోవాలనుకునేవాడు.. రాష్ట్రాన్ని పాలించాలనుకునేవాడు చెప్పులు చూపించకూడదు.. చెప్పుల రాజకీయం చేయకూడదు పవన్ అని హితవుపలికారు.
రాజకీయాలు చేసేవాడు కష్టపడాలి.. ప్రజలు నమ్మకం సంపాదించాలి.. దౌర్భాగ్య రాజకీయాలు చేసే పవన్ రాజకీయాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంబటి.. అసలు పవన్ కల్యాణ్ ప్రభావం రాష్ట్రంలో ఎంత? అని నిలదీశారు.. ప్రజల విశ్వాసం పవన్ పొందలేకపోయాడు.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఎద్దేవా చేశారు. సెక్షన్ 30, 144 అక్కడున్న పరిస్థితులను బట్టి పోలీసులు ప్రయోగిస్తారు.. తప్ప ఎవరిమీద కక్ష సాధింపు కాదని స్పష్టం చేశారు.. ఇక, పవన్ కల్యాణ్, చంద్రబాబుతో పాటు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం.. జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.. పవన్, చంద్రబాబు, బీజేపీ కలసి పోటీ చేసినా సీఎం వైఎస్ జగన్ విజయం సాధిస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పేదలు జగన్ పక్షాన ఉన్నారు.. పవన్, చంద్రబాబు మాట్లాడే మాటలు ఉడత ఊపులు మాత్రమేఅన్నారు. సీఎం జగన్ ఇచ్చిన వాగ్దానాలు 98శాతం నెరవేర్చారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ఈ స్థాయిలో నెరవేర్చలేదన్నారు మంత్రి అంబటి రాంబాబు.