Site icon NTV Telugu

Ambati Rambabu: అయ్యా పవన్ కళ్యాణ్‌.. ఇప్పుడు బీజేపీతో ఉన్నట్లా? లేనట్లా..?

Ambati

Ambati

అవినీతికి పాల్పడిన వారు జైలుకు వెళ్ళి మహాత్మా గాంధీ జయంతి రోజున దీక్షలు చేస్తున్నారు అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డాడు. మహాత్మా గాంధీ ఆత్మ క్షోభిస్తుంది.. జైల్లో ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు.. జైలు దగ్గరే పొత్తు ప్రకటన చేశారు.. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే పవన్ కళ్యాణ్ సభలు, యాత్రలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం 75 వేల మంది ఉన్నారు.. అందుకే పవన్ కళ్యాణ్ అవనిగడ్డలో మీటింగ్ పెట్టాడు అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Spain News : స్పెయిన్‌లో నైట్ క్లబ్‎లో ఘోర అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

వారాహి యాత్రకు తరలి వెళ్ళమని నారా లోకేష్, అచ్చెన్నాయుడు కూడా టీడీపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అయినా వారాహి విజయ యాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట.. మూడు గంటలకు సభ అనుకున్నా.. జనాలు రాకపోవటంతో ఆరు గంటలకు నిర్వహించారు.. కారావ్యాన్ లో కూర్చుని పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదేండ్ల మనోహర్ జనాల తరలింపుకు ఫోన్లు చేసుకున్నారు అని ఆయన ఆరోపించారు.

Read Also: OTT Movies: ఈ వారంలో ఓటీటీలో ఏకంగా 29 సినిమాలు.. ఏ సినిమా ఎక్కడంటే?

అయ్యా పవన్ కళ్యాణ్ ‌… ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి?.. బీజేపీతో ఉన్నట్లా? లేనట్లా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అనైతిక, విశ్వాస రహిత రాజకీయ.. బీజేపీ చెవిలో పవన్ కళ్యాణ్ క్యాలీ ఫ్లవర్ పెట్టాడు.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతే.. ఒక పెళ్ళి చేసుకుని మరొక ఆమెతో బంధం నడిపావు.. రాజకీయంలో కూడా అంతే.. సైకిల్ కు తుప్పు పట్టింది, టైర్లు లేవు.. పవన్ కళ్యాణ్ మొదటి గ్లాసు పగిలిపోయింది.. ఇప్పుడు ఉన్నది రెండో గ్లాసు అని ఆయన సెటైర్ వేశారు. ఎన్నికల కమిషన్ జనసేనకు మొన్న మళ్ళీ గ్లాసు గుర్తును కేటాయించింది.. అంబాజీపేట ఆముదాన్ని గ్లాస్ లో వేసి నీ అసిస్టెంట్ నాదెండ్ల మనోహర్ తో సైకిల్ తుప్పు క్లీన్ చేయ్యు.. చంద్రబాబు చెప్పులు మోయటానికి కూడా సిగ్గు పడని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version