NTV Telugu Site icon

Minister Ambati Rambabu: ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే.. ఆ తర్వాతే మూడు రాజధానులు..!

Ambati

Ambati

Minister Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పొత్తుల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఢిల్లీస్థాయిలో చర్చలు సాగుతోన్న తరుణంలో.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. విమర్శలు గుప్పిస్తోంది.. అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉంది..? బీజేపీతో నా? టీడీపీతో నా..? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.. పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి అనైతికమైన పొత్తులు అని దుయ్యబట్టారు.. మా ప్రత్యర్థులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. అసలు జనసేన ఎవరితో పొత్తు లో ఉంది బీజేపీ తో నా, టీడీపీ తోనా? అని నిలదీశారు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి.. నరసరావుపేట ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయించారని.. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు.. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక ఇంకో పార్టీలోకి వెళ్తున్న లావు ఒక బీసీ ద్రోహిగా ఫైర్‌ అయ్యారు.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరి చేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. ఇక, ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలుచేశారు మంత్రి రాంబాబు.. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసిన ఆయన.. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు.

Read Also: Minister RK Roja: షర్మిలకు మంత్రి రోజా కౌంటర్‌.. వైఎస్సార్‌ ఆశయాలకు నిజమైన వారసుడు జగన్‌ మాత్రమే..!