Site icon NTV Telugu

Ambati Rambabu: ఏంది పవన్ బ్రో.. నీకు ఇదేమి కర్మ

Ambati

Ambati

నిన్న ( శనివారం ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మంగళగిరి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడిరోడ్డుపై పడుకొని నిరసన చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు బయల్దేరి వెళ్లిన పవన్‌ను.. జగ్గయ్యపేట దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. కాలినడకన మంగళగిరి వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా.. అనుమంచిపల్లి దగ్గర పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో జనసేనాని నడిరోడ్డపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.

Read Also: Patancheruvu: బుల్లెట్ బైక్ మీదపడి చిన్నారి మృతి.. ఆడుకుంటుండగా ప్రమాదం

పవన్ కళ్యాణ్ నడిరోడ్డుపై పడుకోవడంపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ “BRO” అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ ను పెట్టాడు. దీనిపై నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. దీనిపై కోర్టులో ఇరువురు తరపున లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు.

Read Also: Rajasthan: 15 ఏళ్లుగా భర్తను ఆ విషయంలో మోసం చేసిన భార్య.. చివరికి ఏం చేసిందంటే

చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన ఇంకా ఎదుర్కోవాల్సింది చాలా కేసులు ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు‌ కాదని, అనివార్యమైందని తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ నేతలు భావించారు కానీ అవేవీ జరుగలేదని అంబటి అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version