NTV Telugu Site icon

Ambati Rambabu: చంద్రబాబు రాజకీయ పల్లకి మోయడానికి పవన్ ఉన్నాడు..

Ambati Rambabu

Ambati Rambabu

శాసన సభలో సవాల్ విసిరి బయటకు వెళ్లి ఏడ్చిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇప్పుడు లోకేశ్ కూడా ఏడుస్తున్నాడు.. చంద్రబాబు ఏడుపు నాటకం, లోకేశ్ ఏడుపు ఆవేదన అనిపిస్తుంది.. తన లాంటి చేత గాని పప్పుకు కూడా మూడు శాఖలు ఇచ్చిన తన తండ్రి చంద్రబాబును జైల్లో వేశారని లోకేశ్ ఆవేదన చెందుతున్న పరిస్థితి అని ఆయన అన్నారు. రాజకీయాలను కాస్ట్లీ చేసిన వ్యక్తి, రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు.. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి 44 రోజులు అయ్యిందని అంబటి రాంబాబు అన్నారు.

Read Also: Jana Reddy: రాహుల్ గాంధీ పై కేటీఆర్ వ్యాఖ్యలు.. జానారెడ్డి కౌంటర్

చంద్రబాబుపై అనేక కేసులలో ఆరోపణలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. క్రింది కోర్టులలో ఎక్కడ చంద్రబాబుకు ఊరట లభించలేదు.. సాక్ష్యా దారాలు ఉన్నాయి, కాబట్టే కోర్టులలో చంద్రబాబుకు రిమాండ్ విధించారు.. ఏదో ఓ కారణంతో చనిపోయిన వాళ్లకు రాజకీయ రంగు అద్ది టీడీపీ నాయకులు ఓదార్పు యాత్ర చేస్తున్నారు.. నిజం గెలవాలనే పేరుతో భువనేశ్వరి కూడా యాత్ర చేస్తారంట.. గతంలో అవినీతి కేసులలో అనేక మంది సీఎంలు, మాజీ సీఎంలు అరెస్ట్ అయ్యారు.. వాళ్ళందరి కన్నా చంద్రబాబు అతీతుడు కాదు అని మంత్రి పేర్కొన్నారు.

Read Also: India-Canada: ట్రూడోని చూసి ఇండియాలో నవ్వుకుంటున్నారు.. కెనడా ప్రతిపక్ష నేత విమర్శలు..

తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందేనని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నారా లోకేశ్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడు.. భువనేశ్వరి, ఐటీ లెక్కలు అధికారులు తెలుసుకుంటే తప్పు ఏంటి?.. చంద్రబాబుకు శిక్ష పడటం ఖాయం.. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబుకు మించిన నాయకుడు భారతదేశంలో లేరు.. మేము కేంద్రంలో చక్రాలు తిప్పలేదు, రాష్ట్రపతిని నియమించలేదు.. మాకు వ్యవస్థలను మానేజ్ చేసే ఆలోచన లేదు, శక్తి లేదు అని ఆయన చెప్పారు. పవన్ కు రాజకీయాలు తెలియవు.. చంద్రబాబు రాజకీయ పల్లకి మోయడానికి పవన్ ఉన్నాడు అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Botsa Satyanarayana: పవన్‌.. నా వద్దకు వస్తే ట్యూషన్‌ చెబుతా: బొత్స

వైసీపీ ఎమ్మెల్యే నా కొడుకులు అన్న పవన్ ఇవాళ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు అంటూ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రేపు టీడీపీ- జనసేనా కలిసి వస్తారంట.. వైసీపీ నాయకులు ఎప్పటి నుండో చెపుతున్న మాట ఇది.. పవన్ మాటలు వింటే గోదారిలో మునిగినట్లే.. మీ ఇంట్లో జగన్ వల్ల మేలు జరిగితే వైసీపీకి ఓటు వేయండి.. పవన్ చంద్రబాబు జేబులో మనిషి.. చంద్రబాబును వదిలి పవన్ ఉండలేడు.. పవన్ కు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు.. చంద్రబాబు ముఖ్యమంత్రి ఐతే చాలు.. ఈరోజు నీతి వ్యాఖ్యానాలు చేస్తున్న లోకేష్ గతాన్ని గుర్తు పెట్టుకోవాలి.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికి పోయాడు.. ఈ విషయం లోకేష్ మరిచపోకూడదు.. డబ్బులతో అవకాశవాద రాజకీయాలు చేయడమే చంద్రబాబు లక్ష్యం.. లోకేశ్ మాట్లాడుతున్న బూతుల దెబ్బకు ప్రెస్ మీట్ లు పెట్టడం ఆపేశారు అని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.