ఏపీలో రాజకీయ విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా మంత్రి అంబటి రాంబాబు టీడీపీ, జనసేనలపై ఒకస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలనే డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఉద్యమం జరిగిందన్నారు. అప్పుడు జరిగిన ఘటనలో తునిలో రైతు దగ్దం అయ్యింది. అప్పుడు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల పై కేసులు కూడా పెట్టారు.
ఆ కేసు విచారణ అనంతరం నేరాన్ని నిరూపించ లేకపోయారు అనే కారణంతో కోర్టు కేసు కొట్టేశారు. ఇది హర్షించదగ్గ పరిణామం.. రైలు దగ్దంలో దాడిశెట్టి రాజా, ముద్రగడ వంటి చాలా మంది పై రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు కేసులు పెట్టారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కాపు వ్యతిరేక పార్టీ. కాపు నేత వంగవీటి మోహన రంగాను చంద్రబాబు ప్రోద్బలంతోనే హత్య చేశారు. హరిరామజోగయ్య స్వయంగా చెప్పారు. అప్పుడు జరిగిన ఘటనల్లో కూడా కాపులపై కేసులు పెట్టారు.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
నా పై కూడా కేసు పెట్టారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపుల పై పెట్టిన కేసులు కొట్టేశారు.. నిరాహార దీక్ష చేస్తానన్న ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్రవధ చేశారు. అప్పుడు కాపుల పై అక్రమంగా పెట్టిన 69 కేసులను జగన్ కొట్టేశారుచంద్రబాబు కాపుల పాలిట ఒక సైకో లా వ్యవహరించాడు. పవన్ కళ్యాణ్ కు చరిత్ర తెలియదు.. కాపు ఉద్యమం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంట్లో పడుకున్నాడు.. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసినా ప్రజలు కలవరు.. మల్లారెడ్డి కామెడీగా మాట్లాడతారు.. ఆ కామెడీలకు నేనేం సమాధానం చెబుతాను.. మల్లారెడ్డి కట్టాల్సిన అవసరం లేదు.. ఆ నీళ్ళ దగ్గర తగాదా పెట్టకుండా మా వాటా మాకు ఇప్పించండి… మీకు దండం పెడతాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారుగా. క్యాష్ మార్పిడి ఏమైనా జరుగుతుందేమో. ఇవన్నీ అనైతిక కలయికలు.ఒక పార్టీలో ఉంటూ వేరే వారితో కలవటం పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత, రాజకీయ జీవితంలో అలవాటే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Read Also: Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్‌లో ఉండేది